Kalyan ram: నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు వరుసగ బాబాయ్ అబ్బాయిలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నట సింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా డిసెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ నటించిన ఈ సినిమాతో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్‌గా మారాడు. అప్పట్లో లెజెండ్ సినిమా జగపతి బాబు కెరీర్‌ని ఎలా మలుపు తిప్పిందో అలాగే ఇప్ప్పుడు అఖండ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ కూడా యూ టర్న్ తీసుకుంటుందని మేకర్స్‌తో పాటు శ్రీకాంత్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు.
ఇక యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ కొత్త సంవత్సరంలో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌తో పాటు ఇతర భాషలలోని నటీ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదే క్రమంలో నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా మారి ఇన్నేళ్ళు అవుతున్నా భారీ హిట్ సినిమా అనేది పడలేదనే చెప్పాలి.
Kalyan ram: కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ‘బింబిసారా’ హయ్యెస్ట్ బడ్జెట్..!
మంచి కమర్షియల్ సక్సెస్‌లు వస్తున్నాయి. కానీ అవి కంటిన్యూస్‌గా మాత్రం రావడం లేదు. అయితే కళ్యాణ్ రామ్ మొదటిసారి ఓ డిఫరెంట్ జోనర్ సినిమాతో వస్తున్నాడు. అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బింబిసారా హయ్యెస్ట్ బడ్జెట్ తో.. హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా మిగతా భాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక డిసెంబర్ నెలలో వస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.