Keerthi suresh: కీర్తి సురేశ్ ఇప్పుడు అన్నీ రకాల సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. క్యారెక్టర్ నచ్చితే రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటివారికి చెల్లిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. గత ఏడాది కీర్తి సురేశ్ నటించిన సినిమాలు ఆమెతో పాటు అభిమానులను తీవ్రంగా నిరాశపరచాయి. చెప్పాలంటే ఇంకా సాలీడ్ హిట్ కీర్తి సురేశ్ అకౌంట్లో చేరలేదనే చెప్పాలి. కానీ మహానటి సినిమాతో తనేంటో నిరూపించుకుంది కాబట్టి ఆ రకంగా మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే నితిన్ రంగ్ దే, ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అణ్ణాత్త సినిమాలో కీలకపాత్రలో నటించింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమలో హీరోయిన్గా నటిస్తున్న కీర్తి, మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేశ్ కాంబినేషన్లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలోనూ చిరుకు చెల్లిగా కనిపించబోతోంది. అలాగే మరోసారి నాని సరసన దసరా సినిమాలోనూ హీరోయిన్గా చేసేందుకు ఒప్పుకుంది. అయితే మహేశ్ బాబుతో నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో భారీ హిట్ అందుతుందని అందరూ చాలా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమాలోని టీజర్ అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Keerthi suresh: కీర్తి తర్వాత ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కమిటవ్వాలా లేదా..?
ముఖ్యంగా ఇందులో కీర్తి లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ సినిమా మీద భారీ అంచనాలను రేపింది. దాంతో సర్కారు వారి పాట సూపర్ హిట్ అవుతుందని కీర్తి మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. కానీ, అంతకంటే ముందే రాబోతున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ గుడ్ లక్ సఖి సినిమాతోనే సాలీడ్ హిట్ అందుకుంటుందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. చాలా నెలలుగా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్, పోస్టర్స్‌తో అంచనాలు పెంచిన గుడ్ లక్ సఖి ఇప్పుడు వచ్చిన సాంగ్‌తో ఆ అంచనాలు మరింతగా పెంచింది. ఈ సినిమా సక్సెస్‌తో కీర్తి తర్వాత ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కమిటవ్వాలా లేదా అని ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి కీర్తి సురేశ్‌కు గుడ్ లక్ సఖి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.