లైగర్ విజయ్ దేవరకొండ కెరీర్ ని మార్చేనా ..?

లైగర్ .. ప్రస్తుతం రౌడీ హీరోగా టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది. vijay devarakonda బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా liger ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్.

ఇక liger సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుండగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ తర్వాత poori jagannadh నుంచి liger వస్తోంది. అయితే ఈ సినిమా సక్సస్ అన్నది మన విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకం. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో vijay devarakonda ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే అంటున్నారు.

పాన్ ఇండియన్ సినిమాల రేంజ్ హీరోగా మారాడు కాబట్టి ఇప్పుడు vijay devarakonda మీద అన్నీ రకాలుగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రాలు బాగా నిరాశపరచాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు పెద్ద డిజాస్టర్ కావడం తో ఇప్పుడు liger మీదే విజయ్ దేవరకొండ కెరీర్ ఆధారపడి ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ తెడా కొడితే కాస్త ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ.