Mahesh babu: మహేశ్ బాబు నిర్మాతగా కంటిన్యూ అవ్వాలా వద్దా డిసైడ్ చేసేది ఆ సినిమానే..?

Share

Mahesh babu: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగుతున్నవారందరూ దాదాపు సొంత నిర్మాణ సంస్థలను స్థాపించి వారితో పాటు బయట హీరోలను పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్.. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, మురళీ మోహన్..ఇలా అప్పటి హీరోలు కూడా సొంతగా నిర్మాణ సంస్థలలో తమ సినిమాలను నిర్మించిన వారే. అయితే హీరోలందరూ నిర్మాతలుగా సక్సెస్ అవలేదు. కేవలం హీరోలు మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నిర్మాతలుగా మారిన వారున్నారు. వీరిలో కూడా సక్సెస్ అయినవారున్నారు.

will-mahesh-babu-continues-as-producer
will-mahesh-babu-continues-as-producer

అలాగే చేతులు కాల్చుకున్న వారు ఉన్నారు. అయినా కూడా చాలామంది సినిమా అంటే ఫ్యాషన్ కాబట్టి బడ్జెట్ తగ్గించుకొని అయినా సరే సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటి జనరేషన్‌లో పవన్ కళ్యాణ్, రాం చరణ్, నాని, ప్రభాస్, మహేశ్ బాబు లాంటి హీరోలందరు సొంత ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టారు. ప్రభాస్ సన్నిహితులతో కలిసి స్థాపించిన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఆయన పాన్ ఇండియన్ సినిమాలను చేస్తూనే చిన్న హీరోలతో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ యంగ్ టాలెంట్‌ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నాని కూడా తన నిర్మాణ సంస్థలో ప్రశాంత్ వర్మను పరిచయం చేశాడు.

 

Mahesh babu: బ్రహ్మోత్సవం మూవీ మహేశ్ బాబుకి తీవ్ర నష్టాలను మిగిల్చింది.

ఇప్పుడు ఆయన సోదరి దీప్తి గంటాను పరిచయం చేస్తూ మీట్ క్యూట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నాని నిర్మించిన గత చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ తనకి లాభాలను మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన పేరు మీద సొంత నిర్మాణ సంస్థను, అలాగే మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశారు. థియేటర్స్ వ్యాపారం బాగానే కొనసాగుతోంది. అయితే జి.మహేశ్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్ మీద తీసిన బ్రహ్మోత్సవం మూవీ మాత్రం మహేశ్ బాబుకి తీవ్ర నష్టాలను మిగిల్చింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన బ్రహ్మోత్సవం ఆ ఫ్యామిలీ ఆడియన్స్‌నే ఆకట్టుకోలేకపోయింది. అయినా మహేశ్ నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలను వేరే నిర్మాతలతో కలిసి తన బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా సర్కారు వారి పాట సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ హీరోయిన్. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మహేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.

Mahesh babu: ఈ సినిమా సక్సెస్ మీదే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్ట్ అధారపడి ఉన్నాయని తెలుస్తోంది.

ఇక టాలెంటెడ్ హీరో అడవి శేష్‌తో మేజర్ చిత్రాన్ని మహేశ్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ అలాగే తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కీలక పాత్రల్లో.. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ లాంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని GMB ఎంటర్ టైన్మెంట్, సోని పిక్చర్స్ ఫిల్మ్స్ మీడియా, A+S మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ మీదే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆధారపడి ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి మేజర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.


Share

Related posts

కెసిఆర్ కి బ్యాడ్ టైమ్ !జగన్ కూడా కారణమా !!

Yandamuri

సిబిఐ కేసు విచారణ నుండి జస్టిస్ రమణ కూడా నిష్క్రమణ

somaraju sharma

పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో…

Siva Prasad