Naga chaitanya : నాగ చైతన్య హిందీ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడా..?

Share

Naga chaitanya : అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన జోష్ సినిమాతో హీరో అయ్యాడు. మొదటి సినిమా యావరేజ్ అని టాక్ వచ్చింది. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరో కాబట్టి అవకాశాలకి కొదవలేదు. అందుకే రెండవ సినిమా ఏ మాయ చేశావే సినిమాలో నటించే అవకాశం అందుకున్నాడు. తమిళ దర్శకుడు గౌతం మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాతో సమంత హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతో ఇద్దరు పెద్ద హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఇటు నాగ చైతన్యకి అలాగే సమంతకి వాళ్ళ టాప్ టెన్ సినిమాల లిస్ట్ లో ఉండేలా హిట్ సాధించింది.

will naga-chaitanya-gets success in bollywood industry...?
will naga-chaitanya-gets success in bollywood industry…?

ఆ తర్వాత నాగ చైతన్య వరుసగా హిట్ అలాగే ఫ్లాప్ అనే లెక్కలు చూసుకోకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. స్క్రీన్ మీద ఇప్పటికే సమంత, చైతుల జంట ఎంతో ఆకర్షణగా నిలిచింది. అభిమానులు కూడా వీరిద్దరు కలిసి సినిమాలు ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తే చూసి ఎంజాయ్ చేయాలని ప్రతీసారీ భావిస్తుంటారు. ఇక తాజాగా సమంత రాజీ అనే వెరైటీ పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ అనే హిందీ వెబ్ సిరీస్ సీక్వెల్ లో నటించి ఆకట్టుకుంది. కానీ దీనితో పాటే విమర్శలు వస్తున్నాయి.

Naga chaitanya : లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో చైతూ ఎంత మేరకు ఆకట్టుకుంటాడో.

ఇదిలా ఉంటే నాగ చైతన్య ఒక హిందీ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తుండగా అందులో ఈ అక్కినేని యంగ్ హీరో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడట. నాగార్జున ఆల్రెడీ బాలీవుడ్ సినిమాలలో చేస్తూ క్రేజ్ సాధించగా ..ఆ దారిలో సమంత..ఇప్పుడు చైతూ అక్కడ స్టార్ స్టేటస్ కోసం ట్రై చేస్తున్నారు. అందరూ పాన్ ఇండియన్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న తరుణంలో చైతు బాలీవుడ్ బాటలో సక్సెస్ కోసం ట్రై చేస్తుండటం ఆసక్తికరం. చూడాలి మరి లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో చైతూ ఎంత మేరకు ఆకట్టుకుంటాడో.


Share

Related posts

Daily Horoscope జూలై 8 బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha

Telangana municipolls: కరోనా ఉధృతి వేళ మున్సిపోల్స్..! భయాందోళనల మధ్య కొనసాగుతున్న ప్రచార పర్వం..!!

somaraju sharma

ఆర్ ఆర్ ఆర్ నుంచి తారక్ బయటకి రాకుండా నే రూమర్స్ మొదలయ్యాయి.. ?

GRK