నాగార్జున అందుకు ఒప్పుకుంటాడా.. బయోపిక్ అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ..?

థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియకపోవడంతో ఇప్పటికే నిర్మాతలకి వడ్డీలా భారం ఎక్కువవుతుండటంతో చిన్న సినిమా అయినా మీడియం రేంజ్ సినిమా అయినా పెద్ద ఓటీటీల నుంచి మంచి ఆఫర్ వస్తే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. రీసెంట్ గా నాని ‘ వి ‘ సినిమా ఇలాగే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో స్టార్ హీరోల సినిమాలకి అద్భుతమైన ఆఫర్స్ ఇస్తున్నారు ఓటీటీ వాళ్ళు.

83 (Hindi) - Official First Look | Ranveer Singh | Kabir Khan | Coming soon 2020 - YouTube

పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ దాదాపు కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గాను నిర్మాత దిల్ రాజు కి 100 కోట్ల వరకు అమెజాన్ ప్రైమ్ వారు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాకి ఇలాగే భారీ ఆఫర్ రావడంతో ఓటీటీలోనే ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే మరో బయోపిక్ ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా రక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఖచ్చితమైన క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని.. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

ఇక ఈ బయోపిక్ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా తెలుగు ప్రేక్షుకుల ముందుకు రాబోతుండటంతో తెలుగులో కూడా ఈ బయోపిక్ పై మంచి క్రేజ్ ఉంది. కాగా ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో 1983లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకునే క్రమంలో ఎదురుకున్న ఇబ్బందుల నేపథ్యంలో రూపొందించారట. అయితే నాగార్జున 83 ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పుకుంటాడా.. అది కూడా బయోపిక్ అని చెప్పుకుంటునారు. ఇక ఇంతకముందు మేకర్స్ ఎటువంటి పరిస్థితుల్లో 83 థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. చూడాలి మరి ఇప్పుడు మేకర్స్ ఆలోచన ఎలా ఉందో.