Nani : నేచురల్ స్టార్ గా నాని కి యంగ్ హీరోలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిర్మాతల హీరో అని కూడా నాని కి పేరుంది. నాని సినిమాలు భారీ లాభాలను తేలేకపోయినా నిర్మాత నష్టాలలో కూరుకుపోడు. అలాంటి సందర్భం ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదు. పెట్టిన బడ్జెట్ నాని సినిమాకి వచ్చిన సందర్భాలే. ఇక నాని కథల ఎంపిక విషయంలో తీసుకునే ప్రత్యేక శ్రద్ద కూడా ఆయన కెరీర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం అయింది. నాని హీరోగా సక్సెస్ లను అందుకున్నాడు. అందుకే నాని కోసం ప్రత్యేకంగా కథలు సిద్దం అవుతున్నాయి.
మొదటి సినిమా అష్టా చమ్మా సినిమా నుంచి ఇప్పటి వరకు గ్యాప్ వచ్చింది అసలు లేదు. ఎప్పుడు రెండు మూడు సినిమాలు చేతిలో ఉంటున్నాయి. ఇప్పుడు కూడా నాని ఆల్రెడీ టక్ జగదీష్ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి రెడీ చేశాడు. అలాగే అంటే సుందరానికి సినిమా, షూటింగ్ సగ భాగం పూర్తయిందని సమాచారం. ఇక కోల్కత్తా నేపథ్యంలో సాగే వెరైటీ స్టోరి శ్యామ్ సింగ రాయ్ కూడా దాదాపు పూర్తి చేశాడు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ కాగా టాక్సీవాలా తో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నాడు.
Nani : నాని సోదరి అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
ఇక నాని నిర్మాతగానూ ఇండస్ట్రీలో మంచి పేరు పొందాడు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న నాని విభిన్నమైన సినిమాలని నిర్మిస్తున్నాడు. ఇందులో భాగంగా తాజా ప్రాజెక్ట్ ఒకటి ప్రకటించాడు. ‘మీట్ క్యూట్’ అనే టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమాకి దర్శకురాలిగా గంటా దీప్తి పరిచయం అవుతోంది. ఈమె నాని సోదరి అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నివేథా థామస్ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. అయితే ఇటీవల ప్రకటించిన పోస్టర్ లో నివేథాను రివీల్ చేయలేదు.