Nayanatara : సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అయితే ఈమె కెరీర్ ప్రారంభం నుంచి తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ కి రాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అగ్ర కథానాయికలలో భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లో నయనతార ఒకరు. అయినా తాను మాత్రం సినిమా షూటింగ్ పూర్తి చేయడం వరకే బాధ్యత వహిస్తుంది. ఈ విషయంలో దర్శక, నిర్మాతలు ఎంతగా బ్రతిమాలినా తాను మాత్రం ప్రమోషన్స్ కి నో అంటుంది. ఈ విషయంలో
కాంట్రవర్సీలైనా, రూమర్స్ వచ్చినా, గాసిప్స్ వచ్చినా ఫ్యాన్స్ ట్రోల్ చేసినా డోంట్ కేర్..అన్న ధోరణిలోనే ఉంటుంది.
మరీ మీడియా వారు గుచ్చి గుచ్చి అడిగితే ఓ సాలీడ్ రీజన్ చెప్పి తప్పించుకుంది. తాను ఇన్నేళ్ళ కెరీర్ లో ఒకే ఒక్కసారి తాను నటించిన సినిమా ప్రమోషన్స్ కి హాజరయ్యాయని ..అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చిన నయన్..అప్పటి నుంచి ఏ సినిమా ప్రమోషన్స్ కి రావడం లేదని తెలిపింది. ఇలా కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ తన సినిమాను తాను ప్రమోట్ చేయడానికే రాని నయనతార చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకుంటుందా ..అంటే అవును ఒప్పుకుందని ప్రస్తుతం టాలీవుడ్ లో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. చిన్నపాత్ర అయినా ఆ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో ..ఓ అగ్ర హీరో సరసన నటించడానికి ఓకే చెప్పిందట.
Nayanatara : మెగాస్టార్ సరసన కాబట్టి నయన్ ఒప్పుకున్నట్టు తాజా సమాచారం.
ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటిస్తున్న ఆచార్య సినిమా పూర్తవడంతో నెక్స్ట్ మలయాళ సూపర్ స్టార్ లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించడానికి సిద్దమవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్ బి చౌదరి, పారాజ్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. ఈ సినిమాలోనే చిన్న పాత్ర అయినా మెగాస్టార్ సరసన కాబట్టి నయన్ ఒప్పుకున్నట్టు తాజా సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు గానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది బాగా వైరల్ అవుతోంది. కాగా ఆమె ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాతో పాటు
మరికొన్ని సెట్స్ మీదున్నాయి.