Venkatesh : విక్టరీకి ఓటీటీ కలిసొస్తుందా..?

Share

Venkatesh : టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో వెంకటేష్ ఒకరు. విక్టరీని తన పేరుకు ముందు చేర్చుకునేలా తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఫ్యామిలీ కథలనే కాకుండా మాస్ అలాగే యాక్షన్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలలో వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వెంకీ అనే పేరు రావడానికి ఆయన నటించిన నువ్వు నాకు నచ్చావ్ ఒక కారణం. ఇలాంటి డీసెంట్ అండ్ ఫ్యామిలీ ..కామెడీ ఎంటర్‌టైనర్స్‌లో వెంకటేష్ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు. గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2 లాంటి భారీ మల్టీస్టారర్స్ చేయడానికి వెంకీ ఎప్పుడూ ముందుంటాడు.

Will OTT converge on Victory Venkatesh...?
Will OTT converge on Victory Venkatesh…?

అంతేకాదు వెంకటేష్ అంటే రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అలాగే సూపర్ గుడ్ ఫిలింస్ లో తెరకెక్కిన ఎక్కువ రీమేక్ సినిమాలలో వెంకీ నటించి హిట్స్ అందుకున్నాడు. రాజా, శీను, వసంతం, చంటి, ఘర్షణ..అలాగే బాలీవుడ్ రీమేక్స్ గా రూపొందిన బాడీగార్డ్, మసాలా, గోపాల గోపాల వంటి సినిమాలు ఆయన లిస్ట్‌లో ఉన్నాయి. అయితే గత ఏడాది నుంచి కరోనా వ్యాప్తితో చిత్ర పరిశ్రమలో ఎలాంటి మార్పులు రాకూడదో అలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో ఓటీటీ సంస్థలకి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Venkatesh : వెంకటేష్ సినిమాలు ఓటీటీలో విడుదల కాలేదు.

దాంతో పలు సౌత్ అండ్ నార్త్ భాషలలో తెరకెక్కిన చిన్న, మీడియం, భారీ బడ్జెట్ సినిమాలను అమెజాన్, జీ 5, నెట్‌ఫ్లిక్స్, ఆహా, స్పార్క్ లాంటి ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమాలను ఓటీటీలందు విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వెంకటేష్ సినిమాలు ఓటీటీలో విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల అనుకుంటున్న నారప్ప, దృశ్యం 2 సినిమాలు ఆయనకి హిట్ ఇస్తాయా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ ఇంకా ఈ చిత్రాల దర్శక, నిర్మాతల నుంచి మాత్రం ఎటువంటి అధికారక ప్రకటన వెలువడలేదు. చూడాలి వీటికి సంబంధించి ఓటీటీ రిలీజ్ అనే ప్రకటన వస్తుందేమో.


Share

Related posts

somu verraju : వీర్రాజు నోట మాట రాకుండా చేసిన కొడాలి నాని

sridhar

‘హామీలన్నీ నెరవేరుస్తున్నాం’

somaraju sharma

Chithu vj New Photos

Gallery Desk