NewsOrbit
న్యూస్

జగన్ వెనుక మోడీ ఉన్నట్టా.. లేనట్టా..? తేలిపోతుంది..!

CM Jagan Delhi Tour: Another Fight on HighCourt?

ఏపీ రాజధాని అంశం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయింది. సుప్రీం నుంచి మూడు రాజధానుల విషయంలో సానుకూల సంకేతాలే వస్తాయని సీఎం జగన్ తోపాటు ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అందుకు తగిన అస్త్రాలను పూర్తిగా సిద్దం చేసుకుని పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు వస్తే శరవేగంగా విశాఖలో రాజధాని పనులు చేపట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీనిలో ప్రధాని మోదీని కూడా భాగస్వామ్యులను చేయాలని కూడా సీఎం భావిస్తున్నారు. తనకు మోదీ అండ, కేంద్రం మద్దతు ఉన్నట్టు ప్రజలకు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు.

will pm narendra modi supports cm jagan
will pm narendra modi supports cm jagan

మోదీ వస్తారా.. రారా..?

ప్రొటోకాల్ ప్రకారం సీఎం జగన్ కేంద్రంలోని పెద్దలని పిలుస్తారు. అయితే.. ప్రధాని మోదీ వస్తారా లేదా అనేదే ప్రశ్న. 2015లో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ యమునా మట్టి, నీళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత అమరావతిపై మోదీ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మోదీపై చంద్రబాబు అనేక విమర్శలు చేశారు. దీనిపై మోదీ నొచ్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రం నుంచి అమరావతికి పెద్దగా సాయం అందలేదు. ఇందుకు బీజేపీపై కూడా విమర్శలు వచ్చాయి. రాజధాని తరలింపు అంశంలో వైసీపీ-బీజేపీ కలిసే నాటకాలు ఆడుతున్నాయని టీడీపీ మొదటి నుంచీ విమర్శిస్తోంది. టీడీపీని దెబ్బ తీసే కుట్రలో ఇదొక భాగమని నమ్ముతోంది.

జగన్ వెనుక మోదీ ఉన్నట్టా.. లేనట్టా..?

మోదీ కనుక విశాఖకు వస్తే.. అమరావతి శంకుస్థాపనకు ఇప్పుడు విశాఖకు ఎలా వస్తారంటూ టీడీపీ విమర్శించే అవకాశం ఉంది. విశాఖకు రాజధాని రావడం కన్ఫర్మ్ అయితే.. ఆ శంకుస్థాపనకు రాకూడదనే కొందరు బీజేపీ పెద్దల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మోదీ వచ్చినా రాకపోయినా ఓ లేఖ రాస్తారని.. అవసరమైన నిధులు సమకూరుస్తారని అంటున్నారు. ఇదే జరిగితే జగన్ వెనుక ప్రధాని మోదీ ఉన్నట్టే. వీటిపై త్వరలోనే స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

author avatar
Muraliak

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju