Kriti Sanon: కృతి సనన్(Kriti Sanon) నటించిన రెండు తెలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్..ప్రభాస్(Prabhas) పాన్ ఇండియన్ సినిమా వర్కౌట్ అవుతుందా..?

Share

Kriti Sanon: కృతి సనన్(Kriti Sanon )నటించిన రెండు తెలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్..ప్రభాస్(Prabhas) పాన్ ఇండియన్ సినిమా వర్కౌట్ అవుతుందా..? ప్రస్తుతం ఇదే టాక్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏ దర్శకుడైనా ఓ హీరోయిన్ పరిచయం చేస్తే మంచి కెరీర్ ఇవ్వాలనే అనుకుంటాడు. కానీ కొన్ని సినిమాలకి ప్రేక్షకాధరణ లభించక బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతుంటాయి. దాంతో ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దర్శక, నిర్మాతలు.. హీరో హీరోయిన్స్‌కు దక్కాల్సిన హిట్ దక్కక తీవ్ర నిరాశ చెందుతుంటారు. అలా చిత్ర యూనిట్ మొత్తం చాలా డిసప్పాయింట్ అయిన సినిమా 1 నేనొక్కడినే(1 nennokadine).

will prabhas pan indian movie works out for kriti sanon...?
will prabhas pan indian movie works out for kriti sanon…?

ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) హీరోగా నటించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దీనికి దర్శకత్వం వహించగా సుకుమార్(Sukumar) ఆస్థాన సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతా బావుంటుంది. మహేశ్ బాబు(Mahesh babu) పర్ఫార్మెన్స్ సూపర్బ్ అని అందరూ చెప్పుకున్నారు. మహేశ్(Mahesh babu) తనయుడు గౌతమ్ ఈ మూవీతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే పరంగా సుకుమార్(Sukumar) ఆడియన్స్‌ను బాగా కన్‌ఫ్యూజ్ చేశాడనే టాక్ సినిమా చూసిన వారు వ్యక్తపరచిన అభిప్రాయం. వాస్తవంగా కూడా ఒక స్థాయి ప్రేక్షకులను మెప్పించలేకపోవడానికి కారణం కూడా ఇదే.

Kriti Sanon: కృతి సనన్(Kriti Sanon) టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోలేకపోయింది.

దాంతో 1 నేనొక్కడినే(1 nennokadine) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన కృతి సనన్(Kriti Sanon) హిట్ అందుకోలేకపోయింది. ఈ సినిమాలో ఏదో పాటలకి వచ్చి అలా కనిపించి వెళ్ళే పాత్ర కృతిది కాదు. సినిమా మొత్తం మంచి పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలోనే నటించింది. సుకుమార్(Sukumar) కూడా ఆమెను బాగా చూపించాడు. కానీ సినిమా ఫ్లాప్ ప్రభావం ఆమె మీద పడింది. ఇక ఈ సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ సినిమాలో అవకాశం అందుకుంది. కృతి సనన్(Kriti Sanon) బ్యాడ్ లక్ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

దాంతో ఇక కృతి సనన్(Kriti Sanon) టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోలేకపోయింది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారింది. చెప్పాలంటే ఆమెకు హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు గర్భిణి స్త్రీగా కథా బలమున్న ప్రయోగాత్మకమైన సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకొని మెప్పిస్తోంది. ఈ కారణంగానే కృతి సనన్(Kriti Sanon) ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్‌లో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో సీత పాత్ర కోసం పలువురు సౌత్ అండ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను పరిశీలించిన మేకర్స్ ఫైనల్‌గా ఛాన్స్ కృతికి ఇచ్చారు.

Kriti Sanon: ఆ తర్వాత కృతి సనన్‌ రేంజ్‌ను ఎవరూ ఊహించలేరు.

ఇది నిజంగా కృతి కూడా ఊహించని అవకాశం. అయితే మన తెలుగు స్టార్స్‌తో నటించిన కృతి సనన్ సక్సెస్‌లు అందుకోలేకపోయింది. అయినా ఏకంగా పాన్ వరల్డ్ మూవీలో ప్రభాస్(Prabhas) సరసన నటిస్తోంది. మరి ఈ సినిమా కృతికి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో అనేది చూడాలి. నిజంగా ఆదిపురుష్ మూవీ గనక భారీ హిట్ సాధిస్తే కృతి సనన్‌కి ఒక్క ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ హీరోయిన్‌గా పాపులారిటీ సాధిస్తుంది. ఆ తర్వాత ఆమె రేంజ్‌ను ఎవరూ ఊహించలేరు. చూడాలి మరి కృతి సనన్‌కి ఆదిపురుష్ మూవీ ఎంతవరకు కలిసి వస్తుందో.


Share

Related posts

బెదిరించిన చైనాకి గట్టి షాక్ ఇచ్చిన భారత్ !

somaraju sharma

Prostate Cancer: ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి..!? ఎన్నిస్టేజెస్.. లక్షణాలు..

bharani jella

ఏపి మండలి చైర్మన్ షరీఫ్‌కి కరోనా

Special Bureau