Rakshita: రవితేజ ‘ఇడియట్’ హీరోయిన్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తే చూస్తారా..?

Share

Rakshita: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే పెళ్ళికి ముందే అవకాశాలు రావడం..ఆదరించడం ఎక్కువగా ఉంటుంది. అదే ఓ హీరోయిన్‌కి పెళ్ళి జరిగి ఇండస్ట్రీకి దూరం అయిందంటే మళ్ళీ ఆ హీరోయిన్ అవకాశాలు రావడం చాలా కష్టం. ప్రియమణిలా ఎంతో క్రేజ్ ఉంటేగాని అవకాశాలు దక్కవు. ఇక సమంత, కాజల్ అగర్వాల్ లాంటి వారిలా కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవడం..ఆ సమయానికి ఆల్రెడీ కొన్ని సినిమాలను కమిటయి ఉండటం…పెళ్ళి తర్వాత సినిమాల బ్రేక్ ఇవ్వకపోతే మాత్రం ఆ క్రేజ్‌కి పెద్ద డ్యామేజ్ ఏమీ జరగదు.

will rakshita re enters in to tollywood
will rakshita re enters in to tollywood

కానీ సంగీత, రక్షిత, రంభ లాంటి సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ కొందరు పెళ్ళి చేసుకున్నాక కొంతకాలం సినిమాలకి దూరమై, ఫ్యామిలీతో గడుపుతూ బిడ్డలకి తల్లైయ్యాక మళ్ళీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలంటే అవకాశాలిచ్చేవారు చాలా తక్కువ. అంతేకాదు ఇలా మళ్లీ సినిమాలలో కనిపించినా ఆదరణ హీరోయిన్ రేంజ్‌లో మాత్రం ఖచ్చితంగా దక్కదు. ఏదో అక్క, వదిన పాత్రలకి తప్ప సీనియర్ హీరోల సరసన నటించడానికి కూడా అవకాశాలివ్వడం చాలా అరుదు. అలాంటి ఆలోచన ఇప్పుడు రక్షిత చేస్తుందట.

Rakshita: దాంతో రక్షితకికి హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి.

కన్నడలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అప్పు సినిమా ద్వారా హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది రక్షిత. ఈ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదే సినిమాను మళ్ళీ తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించాడు. ఈ సినిమా ద్వారా రక్షిత టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అటు కన్నడ, ఇటు తెలుగులో ఒకే సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పూరి దర్శకత్వంలోనే నాగార్జున, ఆసిన్ జంటగా నటించిన శివమణి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా కూడా రక్షితకి మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే మహేష్ బాబుతో నిజం సినిమా, పెళ్ళాం ఊరెళితే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా పూరి తెరకెక్కించిన ఆంధ్రావాలా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో రక్షితకి హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అందరివాడు సినిమాలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది రక్షిత.

Rakshita: రక్షిత రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటే ఆమె మీద మేకర్స్ ఆసక్తి చూపిస్తారో లేదో..?

అయితే రక్షిత ఊపు చూసి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ 2007 తర్వాత పెళ్ళి చేసుకొని ఫేడౌట్ అయిపోయింది. అప్పటి నుంచి రక్షిత ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఫిజిక్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్న కొందరి హీరోయిన్స్‌లా రక్షిత కూడా రీ ఎంట్రీ ఇస్తే చూస్తారా అనేది చాలామందిలో ఉన్న సందేహం. మరి నిజంగా రక్షిత రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎలాంటి పాత్రలకి ఓకే చెప్తుందో..అసలు ఆమె మీద మేకర్స్ ఆసక్తి చూపిస్తారో లేదో చూడాలి.


Share

Related posts

టప్పర్ వేర్ బిజినెస్: లక్ష పెట్టుబడి పెడితే 30 వేల కమీషన్.. భారీ మోసం వెలుగులోకి

Varun G

ఆ హీరోను దారుణంగా రిజెక్ట్ చేసిన నయనతార.. అతను ఎవరో తెలుసా?

Teja

Tirupati By poll : సోము ట్వీట్‌కి అదిరిపోయే రెస్పాన్స్ ..! మీరు చూడండి..!!

somaraju sharma