18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
న్యూస్

IPL : ‘ఐపీఎల్’లో సచిన్ కొడుకు ఆట తీరు చూస్తారా? లేక మరొకరిని బలినా?

Will Sachins son watch the game in IPL Or sacrifice someone else
Share

IPL :  క్రికెట్ ప్రియులందరికీ మరో కొద్ది రోజులలో పండగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. మరి కొన్ని నెలలలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్  ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రియులను పక్కకు కదలకుండా నిత్యం టీవీ లకే అంకితమై పోతారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 1097మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

Will Sachin's son watch the game in 'IPL'? Or sacrifice someone else?
Will Sachin8217s son watch the game in 8216IPL8217 Or sacrifice someone else

1097 మందిలో ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు. మొత్తం 1097 మందిలో ఐపీఎల్ ఆక్షన్ లో తమపేర్లను నమోదు చేసుకున్న వారిలో 814మంది భారత్ కి చెందిన ఆటగాళ్లు ఉండగా 283మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ వేలంలో నమోదు చేసుకున్న వారు షకీబ్ అల్ హసన్ కనీస ధర రూ.2కోట్లు, ఏడేళ్ల తర్వాత సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరుపున ఆడిన శ్రీశాంత్ రూ.75లక్షలు, హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, స్టీవెన్ స్మిత్, బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, కోలిన్ తమ కనీస ప్రారంభ మద్దతు ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. విహారీ రూ.1కోటి, పుజారా రూ .50 లక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన అర్జున్ టెండూల్కర్ ధర రూ.21 లక్షలకు నమోదు చేసుకున్నారు.

ఈనెల 18న జరిగే ఐపీఎల్ వేలంలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ధర ఎంత పలుకుతారు అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఈసారైనా సచిన్ కొడుకును ఎంపిక చేసేటప్పుడు తన ఆట తీరును చూస్తారా? లేకపోతే ఎక్కువ దరకు కొనుగోలు చేస్తారా? అనే ఆశక్తి ఏర్పడింది. ఎందుకనగా…2016లో ముంబై క్రికెట్ అసోసియేషన్ హెచ్.టి. భండారి కప్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఆ టోర్నమెంట్ లో ముంబై తరఫున ఒక ఆటో డ్రైవర్ కుమారుడు 16 ఏళ్ల ప్రణవ్ దనవాడే ఇంగ్లాడ్ బ్యాట్స్‌మెన్ ఆర్థర్ కాలిన్స్ స్కోర్ 628 ను క్రాస్ చేసి రికార్డ్ సృష్టించాడు.

ఈ టోర్నమెంట్ లో ప్రణవ్ 323 బంతులు,129 ఫోర్లు,59 సిక్స్ లతో 1009 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ప్రణవ్ ను సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, మహేంద్ర ధోని అతని ఆటతీరు పై ప్రశంసలు కురిపించారు. కానీ అదే సంవత్సరం జూన్ లో జరిగిన వెస్ట్ జోన్ అండర్_16 సెలక్షన్స్ లో ప్రణవ్ వయస్సు పరిమితి తక్కువగా ఉండటం వల్ల అతనిని సెలక్షన్ కమిటీ సభ్యులు రిజెక్ట్ చేశారు.కానీ అతని వయసు కలిగి ఉన్న సచిన్ టెండూల్కర్ కొడుకును వెస్ట్ జోన్ అండర్_16 తరపున సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు.ఈ విషయంలో సెలక్షన్ కమిటీ సభ్యులు ఆటతీరుకు పట్టం కట్టకుండా కేవలం టెండూల్కర్ కుమారుడు అన్న ఉద్దేశంతో మెరుగైన ఆటతీరును లేకపోయినప్పటికీ అర్జున్ టెండూల్కర్ ను ఎంపిక చేయడం పట్ల సెలక్షన్ కమిటీ సభ్యుల పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ సారి జరిగే ఐపీఎల్ లో ప్రతిభకు పట్టం కడతారా లేకపోతే మరో ఆటోడ్రైవర్ కుమారుడి లాగా ఇంకొకరు బలవుతారు అనేది తెలియాల్సి ఉంది.


Share

Related posts

తాను చేసిన అతిపెద్ద తప్పు అదే అని కుమిలిపోతున్న శ్రీదేవి కూతురు ?

GRK

బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పుతో షాక్ లో దేశం…!

siddhu

బిగ్ బాస్ 4 : మోనల్ తో అభిజీత్ ఆ మాట అనకుండా ఉండాల్సింది .. హారిక కూడా బాధపడేలా !! 

sekhar