Salman khan : సల్మాన్ ఖాన్ .. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడుగా ఎంతటి క్రేజ్ ఉన్న హీరోనో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా రాధే. ఈ సినిమాకి ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో పాటు మరో ఇద్దరు సంగీత దర్శకులు సంగీతం అందించారు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సీటిమార్ సాంగ్ రీమిక్స్ చేశారు. అయితే ఈ సాంగ్ వల్ల సల్మాన్ ఖాన్ ని కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.. నెగిటివ్ కామెంట్స్ కూడా బాగానే వచ్చాయి.
అందుకు కారణం సల్మాన్ సీటిమార్ సాంగ్ చెడగొట్టాడని కొందరు అభిప్రాయపడటమే. ఫ్యాన్స్ కి నచ్చితే నెత్తిమీద పెట్టుకుంటారు.. నచ్చలేదా సోషల్ మీడియాలో కామెంట్స్.. ట్రోల్స్‌తో ఏకిపారేస్తుంటారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్ ఖాన్ హాట్ బ్యూటీ దిశాపటాని జంటగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా రాధే. గతంలో ప్రభుదేవ – సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెలుగు పోకిరి రీమేక్ వాంటెడ్ వచ్చి భారీ హిట్ సాధించింది. అయితే రాధే సినిమాలో అల్లు అర్జున్ పూజా జంటగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటీమార్ సాంగ్ ని సల్మాన్ రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
Salman khan : సల్మాన్ ఖాన్ అసలు కదలనే లేదు.
సల్మాన్‌కి ఇలా సౌత్ సూపర్ హిట్ సాంగ్స్ తన సినిమాలో రీమిక్స్ చేయడం అలవాటే. అయితే తెలుగు సీటీమార్ సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ పెద్ద హైలెట్. ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. అయితే ఈ సాంగ్ రీమేక్స్ లో సల్మాన్ డాన్స్ చాలా దారుణంగా ఉందని ఇటీవల రిలీజైన వీడియో సాంగ్ చూసిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. చాలా చోట్ల సల్మాన్ అసలు కదలనే లేదు. ఇది బన్నీ ఫ్యాన్స్ కి మండిపోయిందట. డాన్స్ బేస్డ్ సాంగ్ ఎందుకు రీమిక్స్ చేసి చెడగొడతారంటూ ట్రోల్ చేస్తున్నారు.