Samantha: పుష్ప సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలు లెక్కలు ఒకెత్తైతే తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయిన సమంత వచ్చాక ఆ లెక్కలు మారాయని కొత్తగా టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో పుష్ప హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కుతోంది. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కూడా రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్టు సుకుమార్ బృందం వెల్లడించలేదు. వెబ్ సిరీస్‌కు రాసుకున్న కథ మొత్తం షూటింగ్ చేసేవరకు రెండు భాగాలకు సరిపడా రష్ వచ్చిందట. దాంతో కొంత భాగాన్ని పుష్ప ది రైజ్ అనే పేరుతో ఈ ఏడాది డిసెంబర్ 17న తీసుకు రాబోతున్నారు.
రంగస్థలం లాంటి సినిమా తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ల నుంచి వస్తున్న సినిమా కావడంతో అన్నీ రకాలుగా పుష్ప మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్..అల్లు అర్జున్, రష్మిక మందన్నల మేకోవర్ సినిమా మీద అంచనాలను మరో రేంజ్‌కు తీసుకువెళ్ళాయి. ఇప్పుడు సమంతతో ఐటెం సాంగ్ చేయించబోతున్నట్టు సుక్కు టీమ్ ప్రకటించి అదే అంచనాలను ఊహకందనంతగా మార్చేశాయి.
Samantha: నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చేస్తున్న ఐటెం సాంగ్..
త్వరలో పుష్ప సినిమా నుంచి 5వ సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఆ 5వ సాంగ్ సమంతపై తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఇందులో ఆమె చాలా బోల్డ్‌గా కనిపించబోతుందట. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి చేసే ఐటెం సాంగ్స్ రేంజ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ సాంగ్ చేస్తున్నందుకు దాదాపు కోటిన్నర రెమ్యునరేషన్ కూడా సమంతకు ముట్టచెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చేస్తున్న ఐటెం సాంగ్..అంతేకాదు కెరీర్లో కూడా ఇది ఫస్ట్ ఐటెం సాంగ్. దాంతో జనాలలో ఓ క్యూరియాసిటీ పెరిగి పుష్ప మీద లెక్కలు వేరేలా మారిపోయాయి. చూడాలి మరి ఎంతవరకు సమంత చేసే ఐటెం సాంగ్ పుష్పకు ప్లస్ అవుతుందో.