Sankar: శంకర్ సినిమా అంటే అంతే..ఆర్సీ 15 అంత త్వరగా పూర్తవడం కష్టమేనా..?

Share

Sankar: సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ జీనియస్‌గా శంకర్‌కు ఎంత గొప్ప పేరుందో అందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమా తీసిన అందులో సామాజిక అంశం ఉంటుంది. దానికి తప్పకుండా అన్నీ కమర్షియల్ హంగులు జోడిస్తారు. హీరో ఇమేజ్ కంటే శంకర్ కథకు ఉండే ఇమేజ్ మీదే సినిమా ఆడుతుందనేది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. చాలామంది దర్శకులు హీరోను మైండ్‌లో పెట్టుకొని కథ రాసుకుంటుంటారు. నిర్మాణ సంస్థ ఓ హీరో డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటే అందుకు తగ్గట్టు కథ సిద్దం చేసుకొని సినిమా తీసేవారే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు.

కానీ శంకర్ అలాకాదు. ఒక అంశాన్ని ఎంచుకొని దానికి పక్కాగా సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి పూర్తిస్థాయిలో కథ సిద్దం అయ్యాకే హీరో ఎవరు సూటవుతారో చూసి ఎంచుకుంటారు. ఆ కథ కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా సిద్దంగా ఉండాల్సిందే. ఒక సాంగ్ తీయడానికి శంకర్ ఇచ్చే బడ్జెట్ ఒక్కోసారి షాక్‌కు గురిచేస్తుంది. చిన్న నిర్మాతలు శంకర్ ఓ సాంగ్‌కు పెట్టే బడ్జెట్‌తో సినిమాలు తీసేయొచ్చు. అంతగా టెక్నికల్ వాల్యూస్‌ను కేవలం సాంగ్స్ కోసమే వాడతారు. అందుకే శంకర్ సినిమా మేకింగ్ కోసం చాలా సమయం తీసుకుంటుంటారు.

Sankar: ‘ఆర్సీ 15’ 6 నెలల్లో సినిమా పూర్తి కావడం అంటే అయ్యేపని కాదు.

ఇటీవలే మెగా పవర్ స్టార్ రాం చరణ్ – కియారా అద్వానీ జంటగా ఓ భారీ బడ్జెట్ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15 వ సినిమా కాగా, దీనిని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు 50వ సినిమా. అందుకే దిల్ రాజు కూడా ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మించడానికి సిద్దపడ్డాడు. ఇటీవలే పూణెలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో 15 రోజులు పాటు చరణ్ – కియారా అద్వానీలపై ఓ సాంగ్‌ను షూట్ చేశారు.

will sankar-movie rc15 takes much time...?
will sankar-movie rc15 takes much time…?

ఆర్సీ 15 ప్రాజెక్ట్ మొదలైనప్పటి రెండు రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. 6 నెలల్లో శంకర్ ఈ సినిమాను పూర్తి చేస్తారని ఒకటి, సంవత్సరంలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనేది ఒకటి. వీటిలో మొదటిది అంటే అసాధ్యం దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. దీనిని మరింతగా నమ్మడానికి ఉదాహరణగా ఇటీవల పూణె షెడ్యూల్‌ను తీసుకోవచ్చు. 15 రోజులు అంటే కొంతమంది దాదాపు 30 నుంచి 40 శాతం టాకీపార్ట్ పూర్తి చేసేస్తారు.కానీ ఆర్సీ 15 కేవలం 1 పాట మాత్రమే షూటింగ్ పూర్తైంది. కాబట్టి 6 నెలల్లో సినిమా పూర్తి కావడం అంటే అయ్యేపని కాదు.

Sankar: ‘భారతీయుడు 2’ డిసెంబర్ నుంచి మొదలు పెట్టాల్సిందిగా తెలుస్తోంది.

ఇక సంవత్సరం అంటే కూడా అంత ఈజీగా నమ్మడం కష్టమే. ఇపుడు దానిని మరింత బలంగా నమ్మొచ్చునని తాజా వార్తలు చూస్తుంటే అర్థమవుతోంది. కమల్ హాసన్‌తో శంకర్ భారతీయుడు 2 మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దర్శక, నిర్మాతలకు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇటీవల ఇద్దరు మధ్య రాజీ కుదరడంతో శంకర్ కమిటయిన సినిమాలను చేసుకోవచ్చునని నిర్మాతలు ఒప్పుకున్నారు. అదే సమయంలో తమ సినిమాను పూర్తి చేయాలని ఒప్పొందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం భారతీయుడు 2 డిసెంబర్ నుంచి మొదలు పెట్టాల్సిందిగా తెలుస్తోంది. ఇంకా 100 రోజులు షూటింగ్ చేయాల్సి ఉండటంతో దాదాపు మార్చ్ వరకు శంకర్ భారతీయుడు 2 కోసం సమయం కేటాయించాల్సి ఉంది. కాబట్టి ఆర్సీ 15 2022లో కంప్లీట్ అయి రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు.


Share

Related posts

సంక్రాంతి రేస్ లో వకీల్ సాబ్ లేదు .. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ..?

GRK

పక్క ప్లానింగ్ తోనే వైసీపీలోకి చలమలశెట్టి ! అదేమిటంటే?

Yandamuri

Acham Naidu : హోమ్ మంత్రి అయ్యి మీ తడాఖా చూస్తా..! ఆవేశం – ఆగ్రహంతో ఊగిపోయిన అచ్చెన్న..!!

Yandamuri