Anjali: అంజలికి శంకర్ సినిమాలో ఛాన్స్ అంటే ఇక లైఫ్ సెటిలయినట్టేనా..?

Share

Anjali: తెలుగమ్మాయి అయినప్పటికి ముందు తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అంజలి. షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాలతో తమిళంలోనే కాకుండా ఆ సినిమాల డబ్బిగ్ వర్షన్‌తో తెలుగులోనూ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగులో అంజలి చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అచ్చ తెలుగమ్మాయి కాబట్టి ఈ సినిమాలో సీత పాత్రతో అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. వెంకటేశ్ సరసన నటించడం అంజలికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అయితే మళ్ళీ తెలుగులో అలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేసే అవకాశం దక్కలేదు.

will shanker movie for anjali-gives chance to get settled
will shanker movie for anjali-gives chance to get settled

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన ‘బలుపు’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. శృతిహాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, రవితేజతో ఆడిపాడిన అంజలికి మంచి పేరు తెచ్చింది బలుపు సినిమా. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఇలా తెలుగులో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకునేసరికి వరుసగా తెలుగు సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ఒకవైపు అటు తెలుగు, ఇటు తమిళ సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తూనే సింగం-2
తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది.

Anjali: అంజలికి పేరు తీసుకు రాలేదు సరికదా విమర్శలు ఎదుర్కొంది.

మరోసారి వెంకీ సరసన మసాలా, కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన గీతాంజలి సినిమాలో నటించే అవకాశాలు అందుకుంది. మసాలా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. కానీ లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ గీతాంజలి మాత్రం హిట్ సాధించింది. ఇక్కడ నుంచే అంజలి తెలుగు సినిమాల ఎంపికలో రాంగ్ స్టెప్స్ వేసింది. శంకరాభరణం సినిమాలో చేసిన పాత్ర అంజలికి పేరు తీసుకు రాలేదు సరికదా విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా అంజలికి ఏమాత్రం కలిసి రాలేదు.

ఇక నందమూరి బాలకృష్ణ సరసన అంజలి నటించిన డిక్టేటర్ భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో అంజలి హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడంలో వెనకబడింది. అందుకే ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయింది. అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఈ సాంగ్ మంచి హిట్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత ఈ అవకాశాలు కూడా అంతగా దక్కలేదు. దాంతో అంజలి కెరీర్ కాస్త నెమ్మదించింది. ఇటు, తెలుగు అటు తమిళ సినిమాలలో పెద్దగా అవకాశాలు దక్కలేదు.

Anjali: అంజలి కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్ళీ ఊపందుకుంది.

చిత్రాంగద సినిమా చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిది. ఎట్టకేలకి అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో ఓ పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఉపయోగం లేకుండా పోయింది. ఇక అంజలి కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ ఊపందుకుంది. ఇందులో అంజలి పోషించిన జరీనా పాత్ర బాగా పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు ఈమెకి ఏకంగా శంకర్ – మెగా పవర స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో అంజలి పాత్రకి గనక బాగా పేరొస్తే మాత్రం బాలీవుడ్ అవకాశాలు కూడా దక్కుతాయని అందరూ చెప్పుకుంటున్నారు.


Share

Related posts

న్యూస్ ఆర్బిట్ ఎక్స్ క్లూజీవ్: గంటా వస్తున్నాడో రావట్లేదు ఈ దెబ్బతో తేలిపోద్ది!

CMR

బాలయ్య సినిమాలో సరికొత్త మార్పులు.. అవి చూస్తే అభిమానులు షాక్ అవ్వడం ఖాయం!

Teja

తాప్సీ కౌంట‌ర్‌.. రంగోలి ఆన్స‌ర్‌

Siva Prasad