Sharwanand: టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్. ప్రస్థానం సినిమాలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఆ తర్వాత హీరోగా మారి డీసెంట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. ఫ్యామీలీ హీరోగానూ, మాస్ హీరోగానూ సినిమాలు చేస్తున్నప్పటికీ శర్వాకు ఎక్కువగా పేరు తెచ్చిపెడుతున్న సినిమాలు మాత్రం ఫ్యామిలీ హీరోగా చేస్తున్న సినిమాలే. శతమానం భవతి సినిమాతో భారీ హిట్ అందుకున్న శర్వాకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత వరుసగా మంచి ప్రాజెక్ట్స్ కమిటయ్యాడు.
పడి పడి లేచె మనసు, రణరంగం సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో హిట్స్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళ హిట్ సినిమా 96 తెలుగు రీమేక్ జాను మూవీలో నటించాడు. సమంత హీరోయిన్గా నటించిన భారీ అంచనాల మధ్య రిలీజై ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇలా కాదని మళ్ళీ శతమానం లాంటి మంచి డీసెంట్ హిట్ కొట్టాలని శ్రీకారం సినిమాను కమిటయ్యాడు. రైతు సమస్యలపై తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కూడా కమర్షియల్‌గా మాత్రం అంతగా సక్సెస్ సాధించలేదు. ఈ సినిమా కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది.
Sharwanand: శర్వా సినిమాలకు మార్కెట్ లేదని చెప్పుకుంటున్నారు.
ఇలా వరుసగా శర్వానంద్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవడంతో మహా సముద్రం సినిమాతో హిట్ కొట్టాలనే కసితో మంచి యాక్షన్ ఎంటర్టైనర్లో నటించాడు. అందరూ ఈ సినిమా సూపర్ హిట్ బ్లైండ్‌గా ఫిక్సైయ్యారు. కానీ రిజల్ట్ విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఇప్పుడు శర్వా సినిమాలకు మార్కెట్ లేదని చెప్పుకుంటున్నారు. అందుకే నెక్స్ట్ సినిమా ఒకే ఒక్క జీవితం ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడయ్యారట. భారీ ఆఫర్ వచ్చిందనే సేఫ్ జోన్లో కనీస లాభాలను దక్కించుకునేందుకే ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే శర్వా క్రేజ్ పడిపోయినట్టే అంటున్నారు. చూడాలి మరి మళ్ళీ ఓ భారీ హిట్ పడితేగానీ శర్వా ఫాంలోకి వస్తాడు.