Prabhas : ప్రభాస్ లేకుండా ఆ సినిమా షూటింగ్ జరుగుతందా..?

Share

Prabhas : పాన్ ఇండియన్ స్టార్ గా ఎంతో పాపులారిటీ క్రేజ్ సాధించాడు డార్లింగ్ ప్రభాస్. ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా చైనా, జపాన్ సహా పలు విదేశాలలోనూ ఆయనకి బాహుబలి సినిమా తర్వాత అభిమానులు, వందల్లో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. మన తెలుగులో వచ్చిన సినిమా ఏదైనా చైనా గానీ, జపాన్ లో గానీ డబ్బింగ్ వెర్షన్ విడుదలైతే అక్కడ అభిమానులు పోటీపడి ఈ సినిమాను చేసేందుకు అన్నీ పనులు మానుకొని థియేటర్స్ కి వెళుతున్నారు. అంతటి క్రేజ్ దక్కించుకుని ఈ పాన్ ఇండియన్ హీరో ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం పాన్ ఇండియన్ తరహాలో తెరకెక్కుతున్నవే.

will shooting is possible without prabhas...?
will shooting is possible without prabhas…?

వీటిలో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో మొట్ట మొదటిసారి ప్రభాస్ ను ఒక డివోషనల్ రోల్ లో చూడబోతున్నారు. చిరంజీవి జనరేషన్ హీరోలు భక్తిప్రధానమైన చిత్రాలలో, పౌరాణిక చిత్రాలలో నటించారు. ఇప్పటి తరం హీరోలలో మొదటిసారి పౌరాణిక పాత్రలో నటిస్తున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రాముడిగా మొదటిసారి ప్రభాస్ కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కృతి సనన్ సీతగా, బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో సన్నీసింగ్ లక్ష్మణ్ పాత్రలో నటిస్తున్నారు.

Prabhas : సైఫ్ అలీఖాన్ ఒక్కడు మాత్రమే పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే ముంబై షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ మెజారిటీ షూటింగ్ పూర్తి చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసిన షెడ్యూల్ ఆగిపోయింది. దాంతో మేకర్స్ ఆదిపురుష్ షూటింగ్ మళ్ళీ ముంబైలో ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో కేవలం రావణ్ పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ ఒక్కడు మాత్రమే పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ గాని, కృతి సనన్ గానీ చేరడం లేదట. ఎక్కువ సీన్స్ సైఫ్ కి సంబంధించినవే కావడంతో ఆయన మీదే ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారట.


Share

Related posts

మళ్ళీ అర్జున్ రెడ్డే నా…?

GRK

Daily Horoscope జూలై 23 గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

మీ పొట్ట ఫుల్ అయినప్పుడు ఇది ఒక్క ముక్క తింటే సరి…

Kumar