Pushpa: రెండు భారీ చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. మన టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు నటించిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితేనే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే టెన్షన్ ఊహించలేము. మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా సూపర్ హిట్ అని ప్రచారం చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న స్టాటజీ ప్రకారం అయితే మల్టీప్లెక్స్ వచ్చాక కూడా ఒకసినిమానే అన్నీ థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాలని, ఆ సినిమాకే ఎక్కువ వసూళ్ళు, లాభాలు రావాలని ఆయా చిత్ర దర్శక..నిర్మాతలు భావిస్తున్నారు.
అదే విధంగా పరస్పర అంగీకారంతో ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ కాకుండా టాక్‌ను బట్టి కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. మరి అదే ఓ హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్‌తో ఓ టాలీవుడ్ సినిమా పోటీ అంటే ఇక అభిమానుల్లో టెన్షన్, మేకర్స్‌లో ఉండే ఉళిక్కిపాటు ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ నటించిన సాహో సినిమాకు పోటీగా బాలీవుడ్ సినిమా వార్ రిలీజై అందరిలో ఎంత కలవరం రేపిందో తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా పుష్ప విషయంలోనూ అదే కలవరం మొదలైందని టాక్ వినిపిస్తోంది.
Pushpa: ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా..!
అందుకు కారణం హాలీవుడ్ మూవీ స్పైడర్ మాన్ నో వే హోం రిలీజ్ డేట్ ప్రకటించి పుష్ప మేకర్స్‌ను కాస్త కలవరపెట్టడమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా..సమంత స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్న సినిమా పుష్ప ది రైజ్ పార్ట్ 1 డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషలలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు స్పైడర్ మాన్ కూడా రిలీజ్ అని మేకర్స్ ప్రకటించారు. కానీ, తాజాగా ఈ సినిమాను ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 16న రిలీజ్ చేస్తున్న మళ్ళీ అధికారికంగా ప్రకటించారు. ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే కొత్త టాక్ మొదలైంది. చూడాలి మరి రెండు సినిమాలు ఏరేంజ్‌లో సక్సెస్ సాధిస్తాయో…ఏ సినిమా ఏ సినిమాకు పోటీ అవుతుందో.