Srikanth : టాలీవుడ్ శ్రీకాంత్ హీరోగా ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో ..ఎలాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ లో పెళ్ళి సందడి ఒక క్లాసిక్. ఎన్నేళ్ళైనా ఆ సినిమాను మర్చిపోరు. అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేసిన శంకర్ దాదా సిరీస్ కూడా శ్రీకాంత్ స్థాయిని పెంచేసింది. అయితే గత కొంతకాలంగా యంగ్ హీరోల తాకిడికి శ్రీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. దాంతో ఈ హీరోకి సినిమాలు హీరోగా తగ్గిపోయాయి. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి.
అయితే అవి కూడా అంత క్రేజ్ ని తీసుకురావడం లేదు. ఒక దశలో హీరో జగపతి బాబు పరిస్థితి కూడా ఇంతే. హీరోగా అద్భుతమైన సక్సెస్లు అందుకున్న జగపతి బాబు ఆ తర్వాత కంప్లీట్ గా హీరో అవకాశాలు తగ్గిపోయాయి. తన తోటీ హీరోలందరూ ఇంకా హీరోగా కొనసాగుతుంటే ఆయనకి మాత్రం హీరో ఛాన్సెస్ పూర్తిగా లేకుండా పోయాయి. దాంతో ఇక టాలీవుడ్ లో జగపతి బాబు ఫేడవుట్ అయ్యాడని చెప్పుకున్నారు. కాని అదే సమయంలో బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాతో దశ దిశ తిరిగింది.
Srikanth : శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబులా సక్సెస్ అవుతాడా..?
అప్పటి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా గొప్ప పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు అదే మ్యాజిక్ శ్రీకాంత్ కెరీర్ లోనూ అఖండ సినిమా ద్వారా జరగబోతుందని అంటున్నాడు. ఇది కూడా బాలయ్య – బోయపాటి సినిమా కావడం విశేషం. అఖండ లో బాలయ్యకి ధీటుగా శ్రీకాంత్ రోల్ ఉంటుందట. సినిమాకి ఈ రోల్ చాలా హైలెట్ అవుతుందని, దీని ద్వారా తన కెరీర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడు. అఖండలో బాలయ్యను ఢీకొనే పాత్రలో నటిస్తుండగా ఆయనకి జంటగా పూర్ణ కనిపించబోతోంది. చూడాలి మరి శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబులా సక్సెస్ అవుతాడా లేదా.