AP PRC: ఉద్యోగులపై సీఎం జగన్ విసిరిన పాచిక ఫలించేనా!రిటైర్మెంట్ ఏజ్ పెంపు చట్టపరంగా నిలిచేనా?

AP Employees JAC to meet cm jagan tomorrow
Share

AP PRC: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 62 ఏళ్లకు పెంచటం అసలు చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2014-2022 ల మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు నాలుగేళ్లు పెరగటం ఇక్కడ గమనార్హం .

Will the dice thrown by CM Jagan on the employees pay off?
Will the dice thrown by CM Jagan on the employees pay off?

ఆదిపురుషుడు చంద్రబాబే !

2014 లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనూహ్యంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని యాభై ఎనిమిది నుండి అరవై ఏళ్లకు పెంచేశారు.అసలు ఎన్నికల్లో ఆ వాగ్దానమే చేయనప్పటికీ చంద్రబాబు తన ప్రమాణ స్వీకారోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.అయితే తెలంగాణ విడిపోయాక నవజాత శిశువుగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోవడం అనివార్యమనే అందరూ భావించారు.అందువల్ల అప్పట్లో అదేమీ వివాదాస్పదం కాలేదు.

బాబు అడుగు జాడల్లో జగన్

అయితే తాజాగా జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడిచింది మరో రెండేళ్లు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచడం మాత్రం అనూహ్యమైన చర్య.నవరత్నాల అమలు కే అప్పులు చేయాల్సి వస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వరుసపెట్టి రిటైరైతే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ సర్కార్ ఉందన్నది వాస్తవం.ఈ పరిస్థితులను అధిగమించడానికి,కొద్దిగా వ్యవధి పొందడానికి జగన్ తెలివిగా ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

AP PRC: అసలు తిరకాసేమిటంటే?

రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు నిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వానికి చుక్కెదురు కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది.గతంలో చంద్రబాబు రిటైర్మెంట్ ఏజ్ పెంచినప్పుడు నిరుద్యోగులు కోర్టుకు వెళితే అరవై సంవత్సరాలకు మించి రిటైర్మెంట్ వయో పరిమితి పెంచకూడదని కోర్టు ఆదేశించింది.కానీ ఇప్పుడు జగన్ మరో రెండేళ్లు పెంచారు.ఇది ఎంతవరకు చట్టపరంగా చెల్లుబాటవుతుందో అనుమానాస్పదమే.

కేరళ, కర్నాటకల్లో చెల్లని నిర్ణయం!

కానీ ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు ఎక్కడా నిలబడినట్టు కనిపించడం లేదు. గతంలో కేరళ,కర్ణాటకల్లోనూ.. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడి హైకోర్టు లు తీవ్రంగా స్పందించాయి.58 ఏళ్లకు మించడానికి వీల్లేదని కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అంతేకాదు.. నిరుద్యోగులకు దక్కాల్సిన అవకాశాలను ప్రభుత్వం అణిచి వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. కర్ణాటకలోనూ 1 సంవత్సరం పెంచుతూ.. యడియూరప్ప సర్కార్ 2009-10 లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా అక్కడి హైకోర్టు తోసిపుచ్చింది.

AP PRC: ఏపీలో కూడా అదే జరగబోతోందా?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 58 కి మించి నాలుగు సంవత్సరాలు పెంచారు. ఇది వివాదం అవుతుందని.. నిరుద్యోగులు.. కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.అదే జరిగితే ప్రతికూల తీర్పు రావడం ఖాయమంటున్నారు.ఇది ప్రభుత్వానికి తెలిసినా కేవలం ఉద్యోగులను శాంత పరిచేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకుని కప్పదాటు వైఖరి అవలంబించారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

 


Share

Related posts

AP Nominated Posts: బిగ్ బ్రేకింగ్..టీటీడీ చైర్మన్ గిరీ మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే..!?..నామినెేటెడ్ పోస్టుల్లో మహిళా నేతలకు పెద్దపీట..!!

somaraju sharma

Shilpa Chowdary: బయటపడుతున్న శిల్పా చౌదరి మోసాలు …!?

Ram

బ్రాయిలర్ చికెన్‌ ఎక్కువగా తినడం వలన ఏమి జరుగుతుందో తెలుసా ??

Kumar