Sudha kongara : సుధ కొంగర .. లేడీ స్టార్ డైరెక్టర్‌గా ఎంతటి పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. విక్టరీ వెంకటేష్‌తో తీసిన గురు సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదే సినిమా అంతక ముందు హిందీ ..తమిళ భాషల్లో తెరకెక్కించి గొప్ప దర్శకురాలిగా పేరు సంపాదించుకుంది. ఇక ఈ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన గత చిత్ర ఆకాశం నీ హద్దురా సూర్యకి సాలీడ్ హిట్ దక్కింది. ఈ సినిమాకి సుధ కొంగర దర్శకురాలు. తమిళం .. తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాతో కూడా దర్శకురాలిగా సుధ కొంగర అటు తమిళ, ఇటు తెలుగు వారి నుంచి గొప్ప ప్రశసంలు అందుకుంది.
ఇప్పుడు ఈవిడ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నాడా…అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. పరశరాం దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇప్పటికే దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ నెల రోజుల కంప్లీట్ అయింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం హైదరాబాద్‌లో ఉగాది రోజున మొదలు పెట్టారు. కానీ కొన్ని రోజులు షూటింగ్ జరిపిన సర్కారు వారి పాట చిత్ర బృందానికి కరోనా బ్రేక్ వేసింది. యూనిట్ సభ్యులలో 5 మందికి కరోనా రావడంతో ప్రస్తుతానికి చిత్రీకరణ నిలిపివేశారు.
Sudha kongara : సుధ కొంగర దర్శకత్వంలో మహేష్ కొత్త ప్రాజెక్ట్స్..!
ఇక ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి తో మహేష్ ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ లేటవుతుందని సమాచారం. అందుకే త్రివిక్రం తో ఒక సినిమా కి సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో కూడా మహేష్ నటించబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మే 31న మహేష్ కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ రావాచ్చని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?