Tollywood stars: మన టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించడం అయ్యే పనేనా..?

Share

Tollywood stars: గత కొంతకాలంగా మన టాలీవుడ్ హీరోలందరూ బాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆ పట్టుదల మన స్టార్స్ లో మరింతగా పెరిగింది. అయితే మనవాళ్ళకి బాలీవుడ్ లో ఆశించినంత క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. ఇంకా కొంతమంది బాలీవుడ్ స్ట్రైట్ సినిమాలు చేయడానికి ఆలోచిస్తున్నారు.

will tollywood-stars get a grip on bollywood market
will tollywood-stars get a grip on bollywood market

అలాంటి వారిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారే ఉన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి హిందీ సినిమాలు చేశారు. అయితే అక్కడ వరుసగా మాత్రం సినిమాలను చేయలేకపోయారు. నాగార్జున కూడా బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. కానీ హిందీ సినిమాలలో నటించే సమయం దొరకలేదా..లేక అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయారా అనేది సమాధానం లేని ప్రశ్న. హిందీలో స్ట్రైట్ సినిమాలు చేయాలనుకున్న మన టాలీవుడ్ స్టార్స్ కి బాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదు.

Tollywood stars: అందుకే హిందీ సినిమాలు ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి.

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ లో తెరకెక్కే సినిమాలన్ని పాన్ ఇండియన్ సినిమాలే. ఇక్కడ పాన్ ఇండియన్ సినిమా అంటే భారీ బడ్జెట్‌తో బహుభాషలలో నిర్మించి రిలీజ్ చేయడమే. ఇప్పటి వరకు అలా సక్సెస్ అయింది ఒక్క రాజమౌళి మాత్రమే. సౌత్ సినిమా ఇండస్ట్రీస్ కంటే ఒక్క నార్త్‌లోని హిందీ ఇండస్ట్రీ మార్కెట్ రేంజే ఎక్కువ. అందుకే హిందీ సినిమాలు ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. కానీ మన సౌత్ సినిమాలు మాత్రం ఆ భాషాలలో మాత్రమే విడుదల చేస్తున్నారు.

మిగతా భాషలలో జస్ట్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. హిందీలో కూడా మన హీరోలు నటించిన సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులకి యాక్షన్ సినిమాలంటే బాగా ఆసక్తి ఉంటుంది. అందుకే తెలుగులో తెరకెక్కిన భారీ యాక్షన్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ రకంగా మన స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ సినిమాలు హిందీలో రిలీజ్ అవుతూ ఆకట్టుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వీరి సినిమాలు పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. చరణ్ – తారక్ ల ఆర్ఆర్ఆర్ సినిమా 10 భాషలలో రిలీజ్ అవుతోంది.

Tollywood stars: ప్రభాస్ కి ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్ మీద బాగా పట్టు వచ్చేసింది.

ఇక అల్లు అర్జున్ పుష్ప 5 భాషలలో రిలీజ్ కానుంది. అయితే అల్లు అర్జున్ తెలుగు తర్వాత హిందీ మార్కెట్ మీద ఫోకస్ బాగా పెట్టి పుష్ప కోసం శ్రమిస్తున్నాడు. తాజాగా నాగ చైతన్య ఆమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నటిస్తూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్ కి ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్ మీద బాగా పట్టు వచ్చేసింది. ఆయన నటించిన సాహో అన్నీ భాషలలో ఫ్లాప్ అయినా హిందీలో మాత్రం 150 కోట్లు వసూళ్ళు రాబట్టింది. అందుకే ఆయన ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్‌లో స్ట్రైట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయనకి ఇక్కడున్న క్రేజ్ అసాధారణం కాబట్టి బాలీవుడ్ మార్కెట్ మీద గ్రిప్ సాధించడం అంత కష్టమేమీ కాదు. సీనియర్ హీరోలలో నాగార్జున మాత్రమే బాలీవుడ్ సినిమాలను ధైర్యంగా ఒప్పుకొని చేస్తున్నాడు. ఇటీవలే భారీ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర లో నటిస్తున్నాడు. మిగతావాళ్ళు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక యంగ్ హీరోలు కూడా ఇప్పుడిప్పుడే అక్కడ సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసం చేస్తున్నారు. చూడాలి మరి ఎంతమంది సక్సెస్ అవుతారో.


Share

Related posts

ఆహారాల ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాపించ‌దు: ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ

Srikanth A

‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’

somaraju sharma

Bollywood :బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్ళీ కుదిపేస్తున్న కరోనా..!

GRK