Trisha: త్రిషకి అవి కలిసొస్తాయా..? లేక వాళ్ళ మాదిరిగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయా..?

Share

Trisha: ప్రస్తుతం డిజిటల్ రంగం మంచి ఊపుమీదుంది. ఏమంటూ కరోనా వచ్చి పడిందో గానీ సినిమాలను థియేటర్స్‌కి వెళ్ళి చూడటానికి బాగా ఆలోచిస్తున్నారు. గత ఏడాదిలో మూతపడిన థియేటర్స్ ఇప్పుడుడిప్పుడే అన్నీ పూర్తి స్థాయిలో తెరుచుకుంటున్నాయి. అయితే కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద విపరీతంగా పడి వేలకోట్లలో నష్టం వచ్చినప్పటికి ఇదే సమయంలో డిజిటల్ రంగానికి మాత్రం ఊహించని స్థాయిలో రెక్కలొచ్చాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన సినిమాను కావాల్సినప్పుడు చూసే వీలు ఉండటంతో మెజారిటీ భాగం జనాలు ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకొని మొబైల్స్‌లో ట్యాబ్స్‌లో..లాప్‌టాప్స్‌లో సినిమాలు చూసేస్తున్నారు.

ఇలా ఓ సంవత్సరం పాటు అలవాటు పడిన జనాలను థియేటర్ ఫీల్ అంతగా పట్టడం లేదు. 2.1, లేదా 5.1 ఉంటే పెద్ద హాల్‌లో కూర్చొని ఫ్యామిలీ అంతా సినిమా చూస్తున్నారు. ఇంట్లోనే థియేటర్స్ ఎఫెక్ట్‌లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో సినిమా మేకర్స్ కూడా థియేటర్స్ అయినా, డిజిటల్ అయినా లాభాలనే చూసుకుంటున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కొంత పర్సెంటేజ్ లాభాలు వస్తే నిర్మొహమాటంగా ఓటీటీలకి తమ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేస్తున్నారు. దాంతో ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లు బాగా ఎక్కువైపోయాయి.

Trisha: కాజల్ అగర్వాల్, తమన్నా సక్సెస్ కాలేకపోయారు.

ఇదే మన స్టార్ హీరో, హీరోయిన్స్‌కు బాగా కలిసి వస్తోంది. దర్శక, రచయితలు కూడా ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా ఎలాంటి కంటెంట్ అయినా డెలివరీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక స్టార్స్ కి వెబ్ సిరీస్‌లలో నటించడానికి కావాల్సినంత ఫ్రీడం దొరుకుతోంది. మూవీ అంటే సెన్సార్ ఉంటుంది. కాబట్టి చాలా లిమిట్స్ మధ్య నటించాలి. కథలను ఎంచుకోవడం..పాత్రలను ఎంచుకోవడంలో సినిమా కంటే ఫ్రీడం వెబ్ సిరీస్‌లలో లభిస్తోంది. దాంతో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించడానికి అందరూ రెడీ అవుతున్నారు.

will-web-series-suitable-for-trisha
will-web-series-suitable-for-trisha

అయితే కొంతమందికి వెబ్ సిరీస్ బాగా కలిసొస్తున్నాయి. కొంతమందికి మాత్రం అంతగా సక్సెస్ రావడం లేదు. స్టార్ హీరోయిన్స్ అయిన కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత, రాధికా ఆప్టే, నిత్యా మీనన్, ప్రియమణి లాంటి వారు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. వీటిలో కూడా ఎక్కువగా థ్రిల్లర్ జోనర్ వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సమంత, ప్రియమణి సక్సెస్ అయినట్టుగా కాజల్ అగర్వాల్, తమన్నా సక్సెస్ కాలేకపోయారు. తమన్నా ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌లలో నటించింది. కానీ వాటికి అంతగా ఆదరణ దక్కలేదు. కాజల్ చేసిన వెబ్ సిరీస్‌కు ఇలాంటి రెస్పోన్సే వచ్చింది.

Trisha: త్రిష చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా..?

అయితే ఇప్పుడు మరో సీనియర్ స్టార్ త్రిష కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘బ్రింద’ అనే వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తుంది. రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. దీనికి సూర్య వంగల దర్శకత్వం వహిస్తుండగా, అవినాష్ కొల్ల, ఆశీష్ కొల్ల కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘బ్రింద’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కూడా సోనీ లీవ్‌లో చేయనున్నట్టు అఫీషియల్‌గా మేకర్స్ తెలిపారు. మరి త్రిష చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో మణిరత్నం రూపొందిస్తున్న పాన్ ఇండియన్ మూవీ పొన్నియన్ సెల్వన్ ఒకటి.


Share

Related posts

సురేందర్ రెడ్డి మీద సైరా ప్రభావం ఇలా పడిందా పాపం ..?

GRK

Tolly wood : అగ్ర కథానాయకులతో మైత్రి వరుస సినిమాలు : విలువ 1500 కోట్లు

Comrade CHE

BREAKING: ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలలో మంచు విష్ణు సంచలన నిర్ణయం ..!

Ram