NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakhapatnam : విశాఖే టార్గెట్ గా విజయసాయిరెడ్డి విశ్వరూపం!వైసిపికి ఈ మెగాసిటీ చిక్కేనా?

AP Politics ; Capital - Visakha Steel Effects on Voting

Visakhapatnam : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజ‌ధానిగా ఉన్న విశాఖ‌ను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ప్రభుత్వ నిర్ణయం విశాఖ వాసులకు పెద్దగా ఇష్టం లేదు. ఈ విష‌యాన్ని గ్రహించే  వైసీపీ నేత‌ల‌తోనే నగరంలో రాజధానికి మద్దతుగా వరుసగా ర్యాలీలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కూడా చేశారు. మరోవైపు విశాఖలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు..అమరావతిలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే విశాఖలో రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని డిమాండ్ చేశారు.

ఇక విశాఖ వైసీపీలోని మెజారిటీ నేతలకు సైతం.. ఇక్కడ పాలనా రాజధానిని ఇష్టం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది బహిరంగ సత్యమే అయినా.. ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహన్‌రెడ్డి ఎట్టి ప‌రిస్థితుల్లో విశాఖ‌కు రాజ‌ధాని తీసుకురావాల‌ని గట్టి పట్టుదలతో ఉండటం గమనార్హం. దీంతో ఎక్కువ ఫోకస్‌ విశాఖ మీదే పెడుతున్నారు!

will-ycp-gets-this-mega-city Visakhapatnam
will-ycp-gets-this-mega-city Visakhapatnam

 

Visakhapatnam : వైసిపి పక్షాన అంతాతానై విజయసాయిరెడ్డి!

నిజానికి 2019 ఎన్నిక‌ల‌లో రాష్ట్రమంత‌టా  వైసీపీ జెండా ఎగిరింది. అయితే విశాఖ నగరంలో తూర్పు, ప‌శ్చిమ, ఉత్తర, ద‌క్షిణ నియోజక‌వ‌ర్గాలు నాలుగింటిని తెలుగుదేశం పార్టీయే గెలుచుకుంది. దీంతో ఇక్కడ వైసీపీ వ్యవ‌హారాల‌ను చూసేందుకు పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందు నుంచి సాగరతీర నగరంలో పాగా వేశారు. విశాఖ‌లో వైసీపీని బలోపేతం చేసేందుకు ఇక్కడ ఫుల్‌ టైం వ‌ర్కవుట్ చేయడంలో ఆయన నిమగ్నం అయ్యారు. విశాఖ‌తోపాటుగా  ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ వ్యవహారాలను ఎంపీ విజయసాయిరెడ్డే చూస్తున్నారు. అయితే ఎక్కువ ఫోకస్‌ మాత్రం విశాఖ మీద పెట్టారు. గ‌తంలో జీవీఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ అభ్యర్థుల జాబితా నుండి ప్రతీది ఆయ‌న ద‌గ్గరుండి చూశారు.

ఇంత‌లో కొవిడ్‌తో ఆ ఎన్నికలు వాయిదా ప‌డ్డాయి. జీవీఎంసీలో  టీడీపీకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని గ‌తంలో వారి స‌ర్వేలో సైతం వెల్లడి అయింది. ఈ క్రమంలో ఒక‌వేళ విశాఖకు పాల‌నా రాజ‌ధాని వ‌చ్చి, జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ గెలిస్తే ప‌రిస్థితి ఊహించడానికి కూడా కష్టతరంగా ఉంటుందని వైసీపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని దృఢనిశ్చయంతో ఉన్నారు.ఇ౦దుకు విజయసాయిరెడ్డి సర్వశక్తులు ధారపోస్తున్నారు.

తాయిలాలు ప౦చేశారు?

ఈ మ‌ధ్యనే సంక్రాంతి పండ‌ుగ‌కు జీవీఎంసీ పరిధిలోని వార్డుల స‌చివాల‌య సిబ్బందితో పాటుగా వాలంటీర్‌లు అందరికీ బ‌ట్టలు, స్వీట్లు, డైరీలు వంటివి అందజేశారు. అంత‌కుముందు దీపావ‌ళి పండ‌ుగకు కూడా అలాగే అందించారట. ఇవన్నీ కూడా ప్రగ‌తిభార‌తీ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారని టాక్. అలా అందజేసిన బట్టలు, స్వీట్లు, డైరీలపై జ‌గనన్న కానుక అని ప్రింటింగ్  కూడా చేశారు. ఇందులో నుండే జ‌ర్నలిస్టుల‌కు కూడా  సంఘాల ద్వారా  పండ‌ుగ అయిపోయిన త‌ర్వాత‌ బ‌ట్టలు పంపిణీ చేశారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాలు నిర్వహించే ఆర్పీల‌తో  ఒక పిక్నిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనీ, మహిళలకు కూడా బట్టలు, స్వీట్లు వంటివి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైందనీ సమాచారం.

ఇక విశాఖలోని మురికివాడలు ఎప్పటినుంచో సమస్యల వలయాల్లో సతమతం అవుతున్నాయనీ, వాటిల్లో మౌలిక వసతులు కల్పిస్తామనీ ఇటీవల హామీలు ఇస్తుండటం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుండటం వంటివి చేశారు. మురికివాడల్లో వైసీపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకే విజయసాయిరెడ్డి ఇలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి విశాఖలో విజయసాయిరెడ్డి ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో.. టీడీపీకి పట్టున్న సాగరతీర నగరంలో ఆయన వ్యూహాలు వైసీపీ బలాన్ని పెంచుతాయో లేదో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?