NewsOrbit
న్యూస్

దిశ మారిన ‘పవనం’ -ఏం చేసేను ‘కమలం’?

రాజధాని తరలింపు విషయంలో ఆ రెండు పార్టీల దారులు వేరయ్యాయి.దీంతో బిజెపి- జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అన్నది డైలమాలో పడింది.

 'Wind' changed direction - what did 'Lotus' do
‘Wind’ changed direction – what did ‘Lotus’ do

రాజధాని అమరావతి విషయంలో బీజేపీ, జనసేనల మధ్య తొలి నుంచి కొంత అయోమయ వాతావరణం నెలకొంది.అయితే తాజాగా జనసేన రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న స్టాండ్ తీసుకుంది.రాజధాని తరలింపు అంశానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

అమరావతిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారని, కొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నందున రాజధానిని తరలిస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని జనసేన అభిప్రాయపడింది. హైకోర్టులో కౌంటర్ వేయాలని జనసేన నిర్ణయించింది.ఇక బిజెపి విషయానికొస్తే కన్నాలక్ష్మీనారాయణ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలన్న వాదన వినిపిస్తూ వచ్చారు.అదే వైఖరితో ఉన్న జనసేన కూడా ఆ సమయంలోనే బిజెపి పంచన చేరింది .

పవన్ కన్నాలు కలిసి రాజధాని అమరావతి రైతుల కోసం లాంగ్ మార్చ్ చేస్తామని ఢిల్లీలో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం వత్తిడితో అది నిరవధికంగా వాయిదా పడింది.ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. అమరావతి రాజధాని తరలింపుపై తమ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలని మాత్రం పోరాడతామని చెప్పారు.

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని పదే పదే స్పష‌్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా రాజధాని అమరావతి తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశం లేదని స్పష్టమవుతుంది.ఇది నచ్చని జనసేన స్వంతంగానే రాజధాని అమరావతి విషయంలో పోరాటానికి సిద్ధపడింది .ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు అటక ఎక్కవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?