విహంగాలతో ..! కొల్లేరు సరసు..! మరింత రమణీయం..!

Share

 

ప్రకృతి రమణీయతను పలకరిస్తూ
విభిన్న సంస్కృతలను సృశిస్తూ
చారిత్రక కట్టడాలపై విహరిస్తూ
వివిధ సంప్రదాయాలను కలుస్తూ
ఐక్యతకు మారు పేరుగా
కుల, మతాలకు అతీతంగా
అనేక ప్రాంతాలకు వలస
వెళ్ళే ఆకాశ విహంగాలు
మన వారసత్వ సంపదకు
శాశ్వత చిరునామాలు..

 

తమ సంతానోత్పత్తికి కోసం వివిధ దేశాల నుంచి వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన విహంగాలతో కొల్లేరు సందడి చేస్తుంది..! ఏటా జులై నుంచి పక్షులు వస్తూ ఉంటాయి..ఇక్కడికి వచ్చిన పక్షులు జట్లు కట్టి విహరిస్తాయి..!కొల్లేరు ఆటపాక పక్షుల కేంద్రంలో విదేశీ విహంగాలు కనువిందు చేస్తున్నాయి. పక్షుల విన్యాసాలు మధురానుభూతులను పంచుతున్నాయి. వలస పక్షుల కిలకిలా రావాలతో ఆటపాక పక్షుల కేంద్రం కళకళలాడుతోంది. విమానాల వలే గాలిలో చక్కర్లు కొడుతున్న పక్షుల విన్యాసాలు చూసి పర్యాటకులు పరవశులవుతున్నారు.

 

 

కొల్లేరు సరస్సు..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 15 కి.మీ. దూరాన ఉన్న కొల్లేరు సరస్సు ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్ద మంచినీటి సరస్సు. ఇది ఒక బర్డ్ శాంక్చురీగా తీర్చిదిద్దబడింది. కొల్లేరు చుట్టూ 122 గ్రామాలున్నాయి. తమ్మిలేరు, బుడమేరు అనే రెండు పెద్ద వాగులు ఈ సరస్సులోకి ప్రవహిస్తున్నాయి. కొల్లేరు.. కృష్ణా, గోదావరి నదుల సంగలో ఉండటంతో వర్షాకాలంలో దీని వైశాల్యం మరింత పెరుగుతుంది. ఇన్ని కారణాల వల్ల ఇక్కడికి అనేక విదేశీ విహంగాలు వస్తాయి. సైబీరియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా వంటి సుదూర ప్రాంతాల నుండి 190కు పైగా రకాల పక్షులు కొల్లేరు వలస వచ్చి సేద తీరుతాయి. అక్టోబర్- మార్చి మధ్య ప్రాంతంలో విదేశీ పక్షులు 2 లక్షల పైబడి వస్తాయని అంచనా. అందువల్లే 1972 నుండి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెలికాన్ సంరక్షణ కేంద్రం పేరుతో శాంక్చురీగా తీర్చిదిద్దింది. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో ఇక్కడ పెలికాన్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. ఇక్కడికి అరుదైన పెలికాన్ పక్షి జాతితోపాటు ఓపెన్ బిల్‌స్ట్రాక్స్, పెయింటెడ్ స్ట్రాక్స్, గ్లోసీ ఇబిసెన్, వైట్ ఇబిసెస్, టీల్స్, పిన్‌టైల్స్, షో వెల్లెర్స్, రైడ్ క్రిస్టెడ్ పో చార్ట్స్, బ్లాక్ వింగ్‌డ్ స్టిల్ట్స్, ఎవోసెట్స్, కామన్ రెడ్‌షాక్స్, క్రిస్టియన్ గాబు, లార్జి విజిటింగ్ టైల్, గ్రేట్ క్రిస్టడ్‌పోచార్, బ్లాక్ హెడెడ్ గ్రిల్, గద్వాల్స్, కార్మోరాస్ట్, జాయింట్ ఇత్యాది అనేక వందల రకాలు కొల్లేరు వచ్చి నివాసమేర్పరచుకొని గుడ్లు పెట్టి, తమ సంతతిని అభివృద్ధి పరచుకొని వెళ్లిపోతుంటాయి. ఇవికాక కొల్లేరు సరస్సులో నత్తకూటు, వెండిపిట్ట, వేపరాయి, తూటుకూర, దూడ కొంగలు, తెల్ల కొంగలు కనిపిస్తుంటాయి. వింత ఏమిటంటే- కొద్ది సంవత్సరాల క్రితం వేసవిలో ఇంత పెద్ద మంచినీటి సరస్సు పూర్తిగా ఎండిపోయి నేల కూడా కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగించింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలవల్ల సమస్యలు సద్దుమణిగి మళ్లీ కొల్లేరుకు పూర్వ వైభవం వచ్చింది. కొల్లేరులో బోటు షికారు చేస్తూ కూడా విదేశీ విహంగాలను వీక్షించవచ్చు.

Share

Related posts

Today Horoscope జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

సడలించిన లాక్ డౌన్ అయిన కనిపించని జనం

Siva Prasad

జగన్ ని పబ్లిక్ గా నిలదీయడం కోసం కే‌సి‌ఆర్ చేతిలో సాలిడ్ ప్రూఫ్ ?

sekhar