Naga Chaithanya : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని గా నాగచైతన్య Naga Chaithanya ప్రస్తుతం సినిమా చేస్తూ ఉన్నారు. “థాంక్యూ” అనే టైటిల్ పేరిట నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమాలో చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో “ఒక్కడు” సినిమాలో మహేష్ కటౌట్ కి నాగచైతన్య పాలాభిషేకం చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ అభిమానిగా పెద్ద కటౌట్ కి కర్ర మీద ఎక్కుతూ నాగ చైతన్య చేసిన ప్రయోగం సోషల్ మీడియాలో వీడియో రూపంలో రిలీజ్ కావటంతో .. నాగచైతన్య లుక్స్ కీ చాలా మంది అభిమానులు ఫిదా అవుతున్నారు.
నాగచైతన్య తండ్రి నాగార్జున మహేష్ బాబు తండ్రి కృష్ణ చాలా సినిమాలు చేయటం తెలిసిందే. అటువంటిది మహేష్ బాబు అభిమానిగా నాగచైతన్య ఈ సినిమా చేస్తూ ఉండటంతో ఘట్టమనేని మరియు అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా చైతు నటిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. చాలా వరకు సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరోపక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుండటంతో ..ఈ యేడాది రెండు సినిమాలతో.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాగచైతన్య సందడి చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ థాంక్యూ సినిమా డైరెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ..ఈ సినిమాపై కూడా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.