టాలీవుడ్ లో ఛలో సినిమాతో పరిచయమైన రష్మిక మందన్న ఈ సినిమాతో పాటు వరసగా గీత గోవిందం- సరిలేరు నీకెవ్వరు- భీష్మ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని లక్కీ హీరోయిన్ గా సెటిలైపోయింది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక కి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ అన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
అలాగే మెగా పవర్ స్టార్ చరణ్ కి జంటగా ‘ఆచార్య లోను నటించబోతుందని తాజా సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా రెడీ చేస్తున్నారు. కాగా నవంబర్ నుండి పుష్ప సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అయితే తాజాగా ఆచార్య సినిమాకి సంబంధించి రష్మిక మందన మేకోవర్ ని ఫైనల్ చేశారట.
‘ఆచార్య’ లో రామ్ చరణ్ తో పాటు అక్టోబర్ లో షూటింగ్ పార్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి రష్మిక పూర్తిగా ప్రిపేరవుతోందని సమాచారం. ఇటు చరణ్ అటు బన్నిలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఈ రెండు నెలలు రష్మిక ఫుల్ బిజీ అంటున్నారు. మెగా హీరోలు.. అది కూడా బావ-బావమరిది తో కలిసి ఒకేసారి షూటింగుల్లో పాల్గొనబోతుండడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇలా ఇంతక ముందు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వరసగా అల్లు అర్జున్, రాం చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. ఇద్దరు మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో రష్మిక వచ్చి చేరింది. మొతానికి రష్మిక ఈ దెబ్బతో డౌట్ లేకుండా నంబర్ వన్ పొజిషన్ లో ఉంటుందైని ఫిల్మ్ నగర్ లో చర్చలు సాగుతున్నాయట.