ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలే ..!

Share

ఒక సినిమాకు మంచి కాంబినేషన్ కుదిరితే ఆ నిర్మాతకు, దర్శకునికి అంతకంటే కావలసింది ఏముంటుంది. ఇలాంటి కాంబోనే ఒక సినిమా త్వరలో తెరపైకి రానుందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుందట. ఇక ఇప్పటికే ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బంపర్ హిట్స్ సొంతం చేసుకున్న అనిల్ రావిపుడి యమ స్పీడ్‌లో ఉన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టాయి. ఈ క్రమంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి డైరక్షన్ లో, బాలయ్య హిరోగా దిల్ రాజు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Director Anil Ravipudi on F3

వాస్తవంగా ఇంతకు ముందే దిల్ రాజు – బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని చేయాలి అనుకున్నారట. కానీ కథ, బడ్జెట్ సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ పెండింగ్ లో పడిందట. కాగా ఇప్పడు మరోసారి దిల్ రాజు బాలయ్య తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. గత కొన్ని రోజులుగా బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు బాలయ్య సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

Dil Raju to produce a film with Balayya soon?

ఇప్పటికే దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కాగా ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను తో బిబి 3 చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య తో సినిమా చేసేందుకు మైత్రీ మూవీస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు సి కళ్యాణ్ కూడా బాలయ్య తో సినిమా నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి దిల్ రాజు బ్యానర్లో బాలయ్య సినిమా ఉండే అవకాశం ఉందా లేదా అన్నది త్వరలో క్లారిటీ రానుంది. ఒకవేళ నిజంగా దిల్ రాజు – బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వస్తే సెన్షేషనల్ హిట్ అవడం మాత్రం పక్కా అంటున్నారు


Share

Related posts

Jammu and kashmir: బిగ్ బ్రేకింగ్..జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు..! ఇద్దరికి స్వల్పగాయాలు..!!

somaraju sharma

దుబ్బాక బై పోల్..9వ రౌండ్‌లోనూ బీజేపీ అధిక్యత

somaraju sharma

ఆ టైటిల్‌ దొరకలేదు కాబట్టే…

Siva Prasad