అమ్మాయి బాగుందని.. లక్షలు పెట్టాడు.. చివరికి?

అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు కల్లు ఆర్పకుండా మరీ చూస్తుంటారు కొందరు అబ్బాయిలు. ఇలాంటి అమ్మాయి తన జీవితాంతం రావాలని కోరుకుంటారు. అందుకోసం ఏమైనా చేసేస్తుంటారు. అమెరికా అబ్బాయి…మంచి లైఫ్.. పెళ్లి కోసం మాట్రిమోనీని అప్రోచ్ అయ్యాడు. ఇంకేముందు అందమైన చిలక అతనికి యాక్సెప్ట్ చేసేసింది. తన అందమైన నగుమోమును అతనికి ఫోటోలు పంపింది. ఇంకేముంది అబ్బాయి ఫుల్ ఫిదా అయ్యారు. పెళ్లి చేసుకుందామని ఏదో సమస్య వచ్చిందని అబ్బాయిని అడిగి డబ్బు గుంజింది.. తీరా అది ఇచ్చాక అమ్మాయి కనిపిస్తుందా.. అంటే అబ్బే అది జరిగే ప్రసక్తే లేదు.. ఇదేంది సినిమా స్టోరీ చెబుతుందనుకుంటున్నారా..కాదండీ ఇది నిజమైన స్టోరీనే..కావాలంటే చదవేసేయండి..

పెళ్లి పేరుతో ఓ యువకుడిని ఓ మాయ లేడి మోసం చేసిన వ్యవహారం గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. తెనాలికి చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆ యువకుడు పెళ్ళి సంబంధాల కోసం మ్యాట్రిమోనిలో వివరాలను నమోదు చేసుకున్నాడు. ఇతని వివరాలు చూసిన యువతీ ఆ యువకుడిని ఫోన్‌ ద్వారా సంప్రదించింది. తన పేరు మైనేని సుముద్ర అని, వాళ్లది ప్రకాశం జిల్లా ఉలవపాడు తన స్వగ్రామమని తెలిపింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికింది. తాను గ్రీన్ కార్డు హోల్డర్‌నని పరిచయం చేసుకుంది. అన్ని వివరాలు తెలుసుకున్న యువకుడు ఆమెను ఫొటోలు పంపమని అడగ్గా.. ఆ మాయలేడి గూగుల్ నుంచి మంచి అందమైన మోడల్ ఫోటోలు పంపంది. అవీ ఇవీ అంటూ తియ్యని మాటలు కలిపి ఆ యువకున్ని పెళ్లిక సిద్ధం చేసింది.

ఆ యువకుడు తనకు పరిచయమైన యువతి గురించి తన ఇంటి సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. వారు కూడా ఆ అమ్మాయి ఫోటోలు చూసి ఓకే చెప్పారు. పెద్ద వారితో మాట్లాతామని అబ్బాయి కుటుంబ సభ్యులు అడగ్గా.. ఆ యువతి తన తల్లిదండ్రులు మద్రాస్ యూనివర్శిటిలో ఫ్రొఫెసర్‌లుగా పని చేస్తున్నారని వారిని నమ్మించింది. తన తండ్రి పేరు శ్రీనివాస్‌గా, తల్లి పేరు దేవిగా తెలిపింది. తన తండ్రి శ్రీనివాస్ అని ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు అతనితో పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు.

తాతమ్మ కథలు చెప్పి ఈ నెల 21న తమ స్వగ్రామం ప్రకాశం జిల్లా ఉలవపాడుకు పెళ్ళి చూపులకు రావాలని, ఈ నెల 24వ తేదిన పసుపు కుంకుమ పెట్టుకుందామని నమ్మబలికారు. అమ్మాయికి బంగారం, బట్టలు కోనుగోలు చేయాలని చెప్పడంతో అది నమ్మిన ఆ అబ్బాయి విడతల వారిగా రూ. 7 లక్షల 20 వేలు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇంకా ఆగుతార ఆ మాయ బ్యాచ్ తన అసలు రంగును బయట పెట్టారు. వారి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్.. అమ్మాయిని చూడాలని 21న అమ్మాయి చెప్పిన ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి అబ్బాయి కుటంబ సభ్యులు వచ్చారు. తీరా వెళ్లాక అటువంటి వారెవ్వరూ అక్కడ లేరని తెలుసుకోవడంతో తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్నారు. దీంతో తాము మోసపోయామని అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.