ఆడవారికి డెలివరీ తర్వాత హార్మోన్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. బిడ్డ జననం తర్వాత వెజైనల్ టిష్యూ పలుచబడి మరింత సెన్సిటివ్ గా అయిపోతుంది. కాబట్టి వెజైనా, యుటేరస్, సెర్విక్స్ వంటివి మామూలు సైజులకి రావాలి అంటే సమయం పడుతుంది. ఒకవేళ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్లయితే శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే డెలివరీ తర్వాత కోసం కొంత కాలం ఆగాల్సిందే. శరీరం తిరిగి ఆడవారికి యథాస్థితికి రావడానికి ఇంకా సమయం పడుతుంది.
అయితే ప్రసవం తర్వాత శృంగారం ఎప్పుడు చేయాలి అన్న విషయంపై అందరికీ అనేక సందేహాలు ఉంటాయి. ఇక ఎంత కాలం ఆగాలి అన్న విషయంపై కూడా ఎంతో సందిగ్దత నెలకొని ఉంటుంది. అయితే ఈ విషయానికి ప్రత్యేకమైన టైం అంటూ ఏమీ లేదు కానీ చాలామంది వైద్యులు మాత్రం కనీసం నాలుగు నుంచి ఆరు వారాల పాటు గ్యాప్ ఇస్తే మంచిదని అంటున్నారు. ముఖ్యంగా నార్మల్ డెలివరీ జరిగినప్పుడు ఈ గ్యాప్ చాలా ముఖ్యం. ఇక అనేక పరిశోధనల్లో తేలింది ఏమిటంటే…. మొదటి డెలివరీ తర్వాత మొదటి మూడు నెలల్లో 83 శాతం మహిళలు అనేక ప్రాబ్లమ్స్ శృంగారం లో పాల్గొన్నప్పుడు ఎదుర్కొన్నారట. అయితే కాలం గడిచే కొద్దీ ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ నెలల కాలం పెరగడంతో ఈ సమస్య తగ్గడం ప్రారంభించింది.
డెలివరీ తర్వాత రికవర్ అయ్యేందుకు…. తిరిగి ఉత్సాహంగా పాల్గొనేందుకు…. తిరిగి శృంగారంలో ఉత్తేంజం వచ్చేందుకు హార్మోన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే డెలివరీ అయిన తర్వాత త్వరితంగా శృంగారంలో పాల్గొంటే ఎపిసియోటమీ, బ్లీడింగ్, నొప్పి, కండరాలు బలహీనపడటం, వెజైనల్ సాగతీత తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ప్రసవించిన తొలి రోజుల్లోనే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మరింత తగ్గుతుంది. ఇక తిరిగి వెజైనల్ పొర ఎలాస్టిసిటీ తిరిగి అదే స్థాయికి రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్స్ చాలా సహజంగా సహాయ పడుతుంది.
కాబట్టి హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు వెజైనల్ పొర డ్రై గా ఉంటుంది. అప్పుడు శృంగారంలో పాల్గొనేటప్పుడు సాధారణంగానే ఇబ్బందులు తలెత్తుతాయి. దీనివల్ల డ్రై గా పొర ఉన్నప్పుడు శృంగారం చేస్తున్న సమయంలో ఇరిటేషన్ తోపాటు బ్లీడింగ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్కు లను పెంచుతాయి. ఇక అక్కడ ఉండే కండరాలు డెలివరీ సమయంలో కూడా కృత్రిమంగా సాగుతాయి. అవి మళ్ళీ వాటి స్థిరత్వాన్ని పొందేందుకు టైం పడుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా సాధారణ డెలివరీ అయిన తర్వాత కొద్ది వారాల పాటు గ్యాప్ ఇచ్చి శృంగారం చేస్తే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎటువంటి రిస్క్ లేకుండా బ్రెస్ట్ ఫీడింగ్ బాగా జరిగిన తర్వాత కనీసం ఒక నాలుగు నుండి ఆరు నెలల వరకు హ్యాప్ ఉంచితే మంచిది లేదా ఎప్పటిలాగా పూర్తి తరహా శృంగారం చేయకుండా ఫోర్ ప్లే వంటి అంశాలతో సరిపెట్టుకుపోవడం వల్ల కొద్దిగా లాభం ఉంటుందని అంటున్నారు వైద్యులు.