ఆ దంపతులు విద్యాధికులే. వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. సొంత ఇల్లు. మంచి ఉద్యోగాలు. కానీ ఆ ఇల్లాలికి కష్టం వచ్చింది. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. పుట్టింటి వారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన సౌజన్య (26)కి శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన హనుమంతు గిరి ప్రసాద్ తో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. మూడు నెలల క్రితం వీరు దువ్వపాలెంలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడ నివసిస్తున్నారు.

Read More: కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం.. సర్కార్ దృష్టి సారించాల్సిన కీలక అంశం ఇది
గిరి ప్రసాద్ నగరంలోని ఓ ఆసుపత్రిలో దంత వైద్యుడుగా పని చేస్తుండగా, సౌజన్య అమెజాన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులను నిర్వహిస్తున్నది. వీరి వివాహ సమయంలో సౌజన్య తల్లిదండ్రులు గిరి ప్రసాద్ కు ఆరు లక్షల నగదు, 13 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. అయినా తరచు డబ్బుల కోసం సౌజన్యతో గిరి ప్రసాద్ గొడవ పడే వాడనీ, మద్యం సేవించి ఇంటికి వచ్చి వేధించే వాడుట. సౌజన్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గిరి ప్రసాద్ వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై సౌజన్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More: సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం .. తిరిగి గన్నవరంలోనే అత్యవసర ల్యాండింగ్