NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పెళ్లి కాదు.. కెరీరే ముఖ్యం అంటున్న యువత..!

వంటింటికే పరిమితమైన అమ్మాయిల జీవితంలో రోజులు మారాయి. స్వేచ్చగా ఎగిరే హక్కును ఎవరూ కాలరాయకుండా ప్రపంచాన్ని అందుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు. ఆడది అంటే అభల కాదు సబల అని నిరూపిస్తూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను బయటపెట్టుకుంటున్నారు. మేమే గొప్ప అన్ని విర్రవీగే మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు.

ఒకప్పుడు అమ్మాయిల పరిస్థితి గోరంగా ఉండేది. వంటిల్లుకే పరిమితి చేసేసి లోకం అంటే కేవలం ఇల్లు అనేదే ఆమెకు కనిపించేది. అమ్మాయే కదా చదువు సంద్యలెందుకమ్మా.. ఒకింటికి వెళ్లే దానికి చదువు కూడానా అని నాటి తల్లి దండ్రులు భావించేవారు. ఇక పెద్దమనిషి అవ్వడమే ఆలస్యం ఎప్పుడు పెళ్లి చేసి పంపుదామా అనే అలోచనే ఉండేది. కాని కాలంతో పాటుగా తరం మారిందీ.. తత్వమూ మారింది. 70 వ దశకం నుంచి అమ్మాయిలు స్వేచ్ఛగా ఎగరటం మొదలు పెట్టారు.

తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పటు చేసుుకుంటున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు సైతం వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె ఎదగటానికి అన్ని విధాల సాయపడుతున్నారు. భూమి నుంచి గగన రంగంలో విహరిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు అమ్మాయిలు. కాగా నేటితరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీని కారణంగా ఆడవారి పెళ్లి వయస్సు రోజు రోజుకు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెళ్లడైంది. దశాబ్దం కాలం కిందట ఆడవారి వివాహ వయస్సు 18 నుంచి 20 వరకు ఉండేది.

కాని నేడు మెజార్టీ అమ్మాయిలు 21 ఏండ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారని సర్వే తెలిపింది. 2006 లో దేశవ్యాప్తంగా యువతుల సగటు వివాహ వయస్సు 20.5 ఉండేది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 19.5 గా ఉండేది. కాగా తెలంగాణాలో సగటు వయస్సు 22 సంత్సరాలకు చేరిందని సర్వేలో వెళ్లడైంది. దీనితో పాటుగా గ్రామీణ యువతుల వివాహా వయస్సు 19.2 నుంచి 21.6 సంవత్సరాలకు పెరిగిందని అధ్యయనంలో తెలిపింది. కాగా ఆడవారి వివాహ వయస్సు మరింత పెరిగే అవకాశాలున్నాయని అధ్యయనం వివరించింది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju