వెళ్లలేరు…వెనక్కువెళ్లండి

శబరిమల, జనవరి 19: శబరిమల అయ్యప్ప దర్శనానికి తాజాగా బయలుదేరిన ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపించారు. పంబ వద్ద నిరసనకారుల ఆందోళన కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికతో నిలక్కల్‌బేస్ క్యాంప్ నుండి ఇద్దరు మహిళలు వెనుతిరిగారు. మూడు రోజుల క్రితం ఇద్దరు మహిళలు పురుషుల దుస్తులు ధరించి  కాలినడకన వస్తుండగా నీలిమల వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారు.

ఎలాగైనా సుప్రీం తీర్పు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత పోలీసు బందోబస్తుతో చర్యలు చేపడుతొంది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు, బిజెపి నేతృత్వంలోని హిందూత్వవాదులు ఆందోళన చేస్తున్నారు.

అయ్యప్ప ఆలయానికి వెళ్లే మార్గంలో బిజెపి నేతృత్వంలోని హిందూత్వవాదులు, దీక్షా స్వాములు మహిళలను అడ్డుకునేందుకు నిఘా కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ సైతం కేరళ సర్కార్ తీరు తప్పుపడుతూ మాట్లాడారు.