NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పెళ్లి ఆపేయండి.. అత‌ను న‌న్ను ప్రేమించాడు!

సినిమాల ప్ర‌భావం ఎంతుందో తెలియ‌దు కానీ పంచ్ డైలాగ్ ల ప్ర‌భావం మాత్రం జ‌నం మీద చాలా ఉంద‌ని ఏదో సినిమాలో అన్న‌ట్లు.. రియ‌ల్ లైఫ్ లో కూడా చాలా చోట్ల ఈ మ‌ధ్య‌ అలాంటి మాట‌ల‌ను వింటున్నాం. అయితే డైలాగ్స్ వ‌ర‌కు ఓకే. కానీ సినిమా సీన్ల‌నే రిపీట్ చేస్తే.. అది ఎలాగుంటుంది. భ‌లే ట్వీస్ట్ గా ఉంటుంది క‌దా..?

సేమ్ అలాంటి ఘ‌ట‌నే ఈ మ‌ధ్య ఒక‌టి జ‌రిగింది. కొద్ది క్ష‌ణాల్లో పెళ్లి అవుతుంది అన‌గానే.. ఒక అమ్మాయి వ‌చ్చేసి అత‌ను న‌న్ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడ‌ని తెలిపింది. పెళ్లి ఆపేయాల‌ని నానా గొడ‌వ చేసింది. దాంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ఇలాంటి ట్వీస్ట్ లు ఉన్న ఈ ఘ‌ట‌న సికింద్రాబాద్ లోని ఒక చ‌ర్చిలో జరిగింది. ఈ వార్త తెలిసిన వారంతా సినిమాను త‌ల‌పించేలా ఉంద‌ని అంటున్నారు.

వివరాల్లోకి వెళితే జన‌గామ జిల్లా యశ్వం‌త‌పూ‌ర్‌కు చెందిన అనిల్‌ హైద‌రా‌బాద్ చివారులోనున్న‌ చౌద‌రి‌గూ‌డలో ఉంటున్న త‌న‌ అమ్మమ్మ ద‌గ్గ‌ర కొన్ని రోజుల నుంచి ఉంటున్నాడు. అక్క‌డే ఒక అమ్మాయి ప‌రిచ‌యం అయ్యింది. వారు మంచి స్నేహితులయ్యారు. క‌ట్ చేస్తే.. ఈ మ‌ధ్య‌ అనిల్‌ తల్లి‌దం‌డ్రులు అత‌డికి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనుకున్న‌ విధంగానే సికిం‌ద్రా‌బాద్‌ అడ్డ‌గుట్ట ప్రాంతంలో ఉంటున్న బంధువుల‌ అమ్మా‌యితో పెండ్లి పిక్స్ చేశారు. దీంతో నిన్న సికింద్రాబాద్ లోనున్న ఒక చ‌ర్చిలో పెళ్లి జ‌ర‌గుతుండ‌గా ఒక అమ్మాయి అక్క‌డ‌కు వ‌చ్చింది.

అక్క‌డ‌కు వ‌చ్చిన అమ్మాయి ఒక్క‌సారిగా.. అ‌నిల్‌ నన్ను ల‌వ్ చేశాడు. పెళ్లి చేసు‌కొం‌టా‌నని నమ్మించాడు. ఇప్పుడు న‌న్ను మోసం చేస్తున్నాడ‌ని గొడ‌వ‌కు దిగింది. ఈ విషయము కాస్తా పోలీసుల‌కు తెలిసింది. దాంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. అమ్మాయి బంధు‌వు‌లకు, పెళ్లి కొడుకు తల్లి‌దం‌డ్రు‌లకు పోలీ‌సులు కౌన్సె‌లింగ్‌ ఇచ్చారు. అలాగే అని‌ల్‌తో ఉన్న సంబం‌ధా‌ల‌కు సాక్ష్యాలు చూపించాల‌ని ఆ అమ్మాయిని అగిగారు. త‌ను ఏ ఆధారాల‌ను చూపించ‌లేక పోయింది. దాంతో త‌న‌ను ఇంటికి పంపించారు. అదే సమ‌యంలో పెళ్లి కూతురు మైనర్‌ అని తెలింది. దీంతో బాలల హక్కుల సంఘం ప్రతి‌ని‌ధులు ఆమెను తీసుకుపోయారు. రెండు కుటుం‌బా‌లపై కేసు పెట్ట‌నున్న‌ట్లు బాల‌ల హ‌క్కుల సంఘం ప్ర‌తినిధులు తెలిపారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!