Bigg Boss Telugu 5: సీజన్ ఫైవ్ ఉమన్ వారియర్ ఆ కంటెస్టెంట్ యే అంటున్న జనాలు..!!

Share

Bigg Boss Telugu 5: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్(Bigg Boss) షో లో… ప్రతి సీజన్ లో.. ఒక లేడీ కంటెస్టెంట్.. ఇంటిలో మంచి పోటీ ఇస్తూ ఉంటది. మగవాళ్ళకి సైతం మతి పోయేలా.. పోటీ ఇచ్చిన లేడీ కంటెస్టెంట్ లు తెలుగు బిగ్ బాస్(Bigg Boss) షోలో చాలామంది ఉన్నారు. ప్రారంభం నుండి చూస్తే హరితేజ(Hariteja), శివ జ్యోతి(Shiva Jyothi), అరియనా(Ariyanaa). వీళ్లంతా గత సీజన్లో మంచి పోటీ ఇచ్చి… టాప్ ఫైవ్ దాకా రావడం జరిగింది. శివ జ్యోతి సీజన్ త్రీ లో … కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇవ్వడం జరిగింది. అలీ రెజా(Ali Reza) లాంటి ఫిజిక్ కలిగిన.. అబ్బాయిలు ఉన్నాగాని సీజన్ త్రీ లో.. వాదోపవాదాలు పరంగా..టాస్క్ పరంగా బాగా ఆడి అందరి చేత శభాష్ అనిపించుకుంది శివ జ్యోతి. చాలా ఎమోషనల్ కంటెస్టెంట్ అయినా గాని తన వాదన వినిపించడంలో.. ఎవరికైనా రీ కౌంటర్ ఇవ్వటంలో.. తిరుగులేని కంటెస్టెంట్ గా.. సీజన్ త్రీ లో రాణించింది. చివరిదాకా నిలబడి టాప్ ఫైవ్ లో నిలిచింది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వేదిక పై మెరిసిన అందం.. ముద్దుగుమ్మ సిరి గురించి మీకు తెలుసా..? | Bigg boss5 telugu: shining beauty on stage .. Do you know about Siri hanumanth ..? | TV9 Telugu

ఇక సీజన్ ఫోర్ లో చూస్తే అరియనా. చిన్ననాటి నుండి అనేక కష్టాలు పడిన అరియనా.. ఇండస్ట్రీలో రాణించటం కోసం.. అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొని సీజన్ ఫోర్ లో… స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చివరిదాకా నిలబడింది. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో.. తన పాయింట్ చెప్పి ఎదుటి కంటెస్టెంట్ నీ .. నామినేట్ చేయటంలో సీజన్ ఫోర్ లో హైలెట్ గా అందరిలో కల్లా నిలిచింది. సోహెల్ లాంటి వ్యక్తులతో కూడా గొడవపడి.. హౌస్ లో ఎదురొడి.. టాప్ లో నిలిచిన అరియనా… ప్రస్తుతం బయట సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. అరియనా(Ariyanaa) లో.. నెగిటివ్ చూస్తే ఆమె కెప్టెన్ అయిన టైం లో ఇంటి సభ్యుల.. పట్ల శాడిస్ట్ గా.. కొన్ని కొన్ని సందర్భాలలో వ్యవహరించటం.. మైనస్ తప్ప మిగతా గేమ్ అంతా అద్భుతంగా ఆడటం జరిగింది. ఇటువంటి తరుణంలో సీజన్ ఫైవ్ లో..ఉమెన్ వారు మాత్రం ఖచ్చితంగా సిరి అని బయట జనాలు చెప్పుకుంటున్నారు.

Bigg Boss 5 Telugu: Bigg Boss gives chillies to Shannu and Siri

టాప్ ఫైవ్ కి వెళ్ళటం గ్యారెంటీ….

హౌస్ లో అబ్బాయిలకు మంచి పోటీ ఇస్తూ కింద పడినా గాని… ఆ దెబ్బలు చూపించి గేమ్ పరంగా తగ్గి పొందకుండా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ..టాస్క్ లలో మంచి పోరాట పటిమ కనబడుతుందని బయట జనాలు చెబుతున్నారు. అదే రీతిలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో కూడా..సిరి.. తనదైన శైలిలో తన పాయింట్ చెబుతూ నామినేట్ చేయటం హైలెట్ అని.. అదేవిధంగా ఫ్రెండ్షిప్ పరంగా తన తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్, జెస్సీ లకి పోరా చాలా సందర్భాలలో అండగా నిలవటం .. ఇంకా చాలా సందర్భాలలో మిగతా కంటెస్టెంట్ ల పట్ల వ్యవహరించటం.. అద్భుతంగా ఉందని కచ్చితంగా..సిరి.. టాప్ ఫైవ్ కి వెళ్ళటం గ్యారెంటీ అని.. బయట జనాలు చెప్పుకుంటున్నారు. అరియనా, శివ జ్యోతి మాదిరిగానే.. సిరి.. ఆట తీరు ఉందని.. దీంతో సీజన్ ఫైవ్ ఉమన్ వారియర్.. కచ్చితంగా సిరి అని బిగ్బాస్(Bigg Boss) ఆడియన్స్ అంటున్నారు. సిరి లో అతిపెద్ద క్వాలిటీ మనసులో ఏది పెట్టుకోకుండా మొహం మీద మాట్లాడటంతో పాటు, ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్ లతో కలిసి పోవడం.. హైలెట్. ఎక్కడ ఏది ఎవరికి వారు అలా ఇచ్చేస్తూ సిరి ఆడుతున్న గేమ్.. కచ్చితంగా ఆమెను టాప్ ఫైవ్ లో చేరుస్తుందని చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

హ్యుందాయ్ జోరు..!! మరో అరుదైన మైలురాయిని చేరుకుంది..

bharani jella

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు పంద్రాగ‌స్టు కానుక‌.. ఏమిటంటే..?

Srikanth A

Madanapalle : మదనపల్లె ఘటనలో కోట్ల విలువైన ఆస్తి కోణం?జంట హత్యల వెనుక పెద్ద స్కెచ్??

Yandamuri