ప్రపంచ ఛాంపియన్ పోటీలో రజత పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా … ప్రధాని మోడీ సహా ప్రముఖుల అభినందనలు

Share

ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జూవెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించారు. అమెరికాలోని యూజీస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2022 లో నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్ లో 88.13 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా .. సిల్వర్ మెడల్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నాన్ని ఫౌల్ త్రోతో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39 మీటర్లు విసిరి నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడవ ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. నాల్గవ ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు. నాల్గవ ప్రయత్నంలో విసిరిన దూరాన్ని అత్యధికంగా లెక్కించారు.

డిఫెండింగ్ చాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్లు త్రో చేసి మరో సారి విజేతగా నిలిచి స్వర్ణం దక్కించుకున్నారు. టోక్యో ఒలంపిక్స్ లో రజతం గెల్చిన వద్లెచ్ 88.09 మీటర్లు దూరం త్రో చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. ఇక సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డుల కెక్కారు. అంతకు ముందు 2003 లో పారిస్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది.

మోడీ సహా ప్రముఖుల అభినందనలు

రజత పతకం గెల్చిన నీరజ్ చోప్రాకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలుపురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. చరిత్ర సృష్టించిన నీరజ్ ను ప్రధాని మోడీ ప్రశంసిస్తూ .. క్రీడల్లో భారత్ కు ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. రానున్న పోటీల్లోనూ మంచి ప్రదర్శన చేయాలని మోడీ ఆకాంక్షించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుసహ పలువురు ప్రముఖులు నీరజ్ కు అభినందనలు తెలియజేశారు.

నీరజ్ స్వగ్రామంలో సంబరాలు

నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించడం పట్ల నీరజ్ స్వగ్రామమైన పానిపత్ (హర్యానా)లో సంబరాలు అంబరాన్నంటాయి. అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నృత్యాలు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీరజ్ శ్రమకు ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు అతని తల్లి సరోజా దేవి. నీరజ్ పతకం సాధిస్తాడని తమకు ముందే తెలుసని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన ఏపి సర్కార్ .. ఉచిత బియ్యం పంపిణీ చర్యల్లో బిగ్ ట్విస్ట్.. ఏమిటంటే..?


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

5 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago