NewsOrbit
న్యూస్

W.H.O.. నమ్మకం పోగొట్టుకుంటోందా? చీఫ్ మాటలే నిదర్శనం

world health organaization

ప్రజారోగ్యంలో ప్రపంచానికే పెద్ద దిక్కులా ఉండాల్సిన డబ్ల్యూహెచ్ఓ తన నమ్మకాన్ని పోగొట్టుకుంటుందా.. అంటే అవుననే అనిపిస్తున్నాయి పరిస్థితులు. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనానను మొదట్లో చాలా లైట్ గా తీసుకుంది. ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటించేసిన చైనాను ఏమాత్రం అప్రమత్తం చేయలేదు. చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

world health organaization
world health organaization

 

మొదట్లో ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించదు అని చెప్పిందే డబ్ల్యూహెచ్ఓ. చైనా తప్పు లేదన్నట్టు వెనుకేసుకొచ్చినట్టు వ్యవహరించింది. చైనాలో ఏం జరుగుతుందోజజ వైరస్ వ్యాప్తి ఎలా జరిగిందో.. కనీసం పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రపంచ ముప్పుకు పరోక్ష కారణంగా నిలిచింది.ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు సంస్థ చీఫ్. ఆయా దేశాలు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు. చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసి మిగిలిన ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం చాలా ఉంది.

ఇప్పట్లో వైరస్ కు మందు రాదనే చీఫ్ మాటలు ఎలా తీసుకోవాలో ప్రపంచానికి అర్ధం కావడంలేదు. మొదట్లో వైరస్ పెద్ద ప్రమాదకారి కాదనేట్టు మాట్లాడి ఇప్పుడు మందు రాదనే సంకేతాలిస్తుంటే డబ్ల్యూహెచ్ఓ మాటలు నమ్మేదెలా అంటున్నాయి దేశాలు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి భయన్ని అంటగట్టింది. అందుకే.. కరోనా వ్యాప్తి ప్రారంభంలో డబ్ల్యూహెచ్ఓ సరైన హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసి డబ్ల్యూహెచ్ఓ నుంచి యూఎస్ వైదొలగిన విషయం తెలిసిందే.

 

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju