సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయట ఎక్కువగా గుమిగూడడం వంటివి జరిగే అవకాశం లేదు.
మహేష్ బాబు కూడా తన పుట్టినరోజు సందర్భంగా భారీ వేడుకలు చేయకండి అని చెప్పిన సందర్భంలో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలోనే తమ సత్తా చూపిస్తున్నారు. ఈరోజుల్లో పుట్టినరోజు సందర్భంగా ట్రెండ్ చేయడం అనేది ఒక ఫీట్ గా మారింది. దీంతో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా #HBDMaheshBabu అనే హ్యాష్ ట్రాప్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. అంతే కాదు. టాప్ 2 ట్రెండ్స్ లో రెండవ స్థానంలో నిలిచింది ఈ హ్యాష్ ట్యాగ్. 60 మిలియన్ ట్వీట్స్ తో #twitterbestfandom అనేది మొదటి స్థానంలో ఉంది. మహేష్ బాబు హ్యాష్ ట్యాగ్ 40.8 మిలియన్ ట్వీట్స్ తో రెండవ స్థానంలో ఉంది.