న్యూస్

worship : గుడికి వెళ్లిన ,పూజ చేసుకున్న భగవంతుడిని కొరవలసిన కోరికలు ఇవే !!

Share

worship : సులభముగా ప్రశాంతం గా
మనం ప్రతి రోజు భగవంతుణ్ణి  ఏది  కోరితే దాన్నే
తీరుస్తాడు. అలా కాకుండా ఏదీ కోరకుండా  కేవలం నమస్కరిస్తే  జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు  అని అంటారు మన పెద్దవాళ్ళు.నిజానికి రెండోవది  మంచి పద్దతి ,కానీ మనం సామాన్య మానవులం ఏ కోరికనూ కోరకుండా ఉండలేము  కాబట్టి
ఏదో ఒకటి  కోరుకుంటూనే ఉంటాం .ఎవరి అవసరం వారిది.ఎవరి కోరిక వారిది. కానీ ప్రతి ఒక్కరు  కోరవలిసిన కోరికలు మూడు ఉన్నాయి. ప్రతి మనిషి వాటిని తప్పకుండ కోరుకోవాలి. అవి ఏమిటంటే ,అనాయాసేన మరణం,వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాయుజ్యం,దేహి మే పార్వతీపతే .
అంటే ఎటువంటి యాతన  లేకుండా  చాలా సులభముగా ప్రశాంతం గా  మరణించాలి అని కోరుకోవాలి.

worship :గౌరవంగా జీవించా

శరీరానికి  వ్యాధి రావడం ,ముసలితనం ,మరణం అనేవి   కచ్చితం గా ఉంటాయి.  ఈ మూడుస్థితులలోను శరీరం నానా యాతనకు  గురి అవుతుంది.అలాంటి వాటితో బాధ పడకుండా,   మరణించాలి. ఎటువంటి దీనావస్థ లేకుండా   ఎవరి ముందు చేయిచాచకుండా గౌరవంగా జీవించాలి.
ప్రతి మనిషికి  కనీస  అవసరాలు మూడు .ఒకటి కడుపునిండా భోజనం ,ఒంటినిండా కట్టుకోవటానికి మంచి వస్త్రం తల దాచుకోవడానికి ఒక  మంచి ఇల్లు  ఇవి కచ్చితమైన అవసరాలు..కనుక వాటికి లోటు లేకుండా  ఉండి   ఇతరుల దగ్గర  “దేహీ “!
అని  అడిగే  దుస్థితి లేకుండా గౌరవంగా బ్రతకాలి అని కోరుకోవడం అనేది  రెండో కోరిక .

హాయిగా మరణించాలి

మరణం పొందిన  తర్వాత నీలో ఐక్యమైపోవాలి -పరమేశ్వరా .. ఇక చివరిది ,అత్యంత ప్రధానమైనది ముక్తి .
అంటే  పునర్జన్మ లేని విధంగా భగవంతునిలోకలిసిపోవాలి అని కోరుకోవాలి.దీని మొత్తం సారం ఏమిటంటే , జీవితం ఉన్నంత కాలం  సంతొషంగా ,గౌరవప్రదంగా బ్రతకాలి .సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుష్షు   ముగిసిన తర్వాత హాయిగా మరణించాలి .మరణించిన తర్వాత మన ఇష్టదైవంలో ఐక్యమయిపోవాలి  అని మనమందరమూ   ఆ భగవంతుణ్ణి కోరవలిసిన ముచ్చటైన మూడు కోరికలు.


Share

Related posts

అంచనాలు పెంచడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా.. ఆర్ఆర్ఆర్ విషయంలో పెద్ద మిరాకిల్ జరగబోతుంది ..!

GRK

Dubai: భార్య క్రెడిట్ కార్డుతో ఆ భర్త గర్ల్ ఫ్రెండ్ కోసం ఏమి చేసాడో తెలుసా?? దీని వెనుక మంచి ట్విస్ట్ !!

Naina

Vakeel saab prime Video: వకీల్ సాబ్ ప్రైమ్ వీడియో వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

bharani jella