NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

వికృత సమాజం..! క్రికెటర్ అవ్వాలంటే కుటుంబాలు ఉండకూడదా..?

ఈ వార్త చదివే ముందు సమాజం చచ్చిపోయింది అని.., సోషల్ మీడియాలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం… అని కాసేపు తల దించుకుందాం..! వినడానికి, రాయడానికి, చదవడానికి కూడా మెదడులో ప్రళయం కలిగే చెండాలపు సంస్కృతిని ఓ సారి చూసొద్దాం..!!

సోషల్ మీడియా యూజర్లకు పెళ్ళాలు ఉండరా..? పిల్లలు ఉండరా..!? వారి విలువలు తెలియవా..? మానవతా విలువలు ఏ మాత్రం పరిచయం లేవా..? ఇవన్నీ ఉన్నా అవసరం లేదా..?? ట్రోల్ చేయడమే పనిగా వికృతంగా చెలరేగడానికే దీన్ని యూజ్ చేస్తుంటారా..? ఏమో ఈ చెండాలపు సంస్కృతి ఉంటె ఏదో దేశాన ఉంటె ఉండనీ… కానీ యువగళం.., యువనరం.., యువ రక్తం ఎక్కువగా ఉన్నా భారతానా మాత్రం వద్దు..! ముక్కు పచ్చలారని పసికందుని రేప్ చేస్తామని బెదిరించడం ఏంటి..? పెళ్ళాంని నిందించడం ఏంటి..? క్రికెటర్ సరిగా ఆడకపోతే వాళ్ళు ఏం చేస్తారు..?

ఇదిగో ఈ పాప వయసు ఐదేళ్లు..! పసిబుగ్గలు, చూస్తే గారాబం చేయాలనిపించే చిన్నారితల్లి..! ధోని బిడ్డ. ఆ ధోని మహానుభావుడు ఐపీఎల్ లో సరిగా బాటింగ్ చేయడం లేదని.. ఈ దరిద్రపు సోషల్ మీడియా ఆ చిన్నారిని టార్గెట్ చేసింది. ట్రోల్ చేసింది. ఆ చిన్నారిని రేప్ చేస్తాం అంటూ బెదిరించింది. సోషల్ మీడియాలో ఆ చిన్నారిని నిన్న ఉదయం నుండి ట్రోల్ల్స్ చేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏమైంది.. ఈ యువ దేశానికి ఏమైంది..? చెన్నై గెలవకపోతే ఆ పాపది పాపమా..? ధోనీ ఆడకపోతే ఆ పాపకి శాపమా..? అసలు ఐపీఎల్ కి ఆ చిన్నారికి సంబంధం ఏంటి..? క్రికెట్ కి ఆ పాపకి సంబంధం ఏంటి..? ధోని ఆడకపోతే ధోనిని తిట్టుకోవచ్చు కదా..?? వికృత కామెంట్లు, తిట్లతో ధోనీని ఆడుకోవచ్చు కదా..!! పిల్లలు, పెళ్ళాలు ఏం చేసినట్టు..?

అయినా ముందు అనాల్సింది సునీల్ గవాస్కర్ అనే పెద్దాయనని..! ఐపీఎల్ లో కోహ్లీ విఫలమవుతున్నాడని అనుష్క శర్మని అన్నాడు. అక్కడ ఊతమిచ్చినట్టు ఇక మొదలయింది. సోషల్ మీడియాలో యుద్ధం. క్రికెటర్లకు కుటుంబాలను, బంధాలను నిందించడం ఇదే మొదటిసారి కాదు. కానీ పసిపిల్లలను రేప్ చేసేస్తాం అనడం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే దేశం యావత్తు ఆశ్చర్యపోతుంది. బాలీవుడ్ నటులు, దేశ ప్రముఖులు ధోనీ పాపకి మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు కావాల్సింది మద్దతు, సానుభూతి కాదు. ఆ ట్రోలింగ్ మొదట స్టార్ట్ చేసిన వాడిని కనిపెట్టాలి. ఈ వికృతానికి వాడ్ని బలిచేయాలి.

 

 

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju