NewsOrbit
జాతీయం న్యూస్

Wrestler Arrest: పంజాబ్ లో పట్టుబడ్డ రెజ్లర్ సుశీల్ కుమార్!వీడనున్న ఢిల్లీ హత్యకేసు మిస్టరీ!!

Wrestler Arrest: ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఒలింపిక్ మెడలిస్ట్ రెజ్లర్ సుశీల్ కుమార్ పోలీసులకు దొరికిపోయాడు.మే నాలుగో తేదీ రాత్రి ఈ హత్య జరగ్గా ఆ పక్క రోజునుండే సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడు.ఒక దశలో సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు లక్ష రూపాయల పారితోషికాన్ని కూడా ప్రకటించారు. సుశీల్ కుమార్ ను పట్టుకునేందుకు ఎనిమిది పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి .అంతేగాకుండా అతను దేశం నుంచి పరారీ కాకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.అన్ని ప్రయత్నాలు ఫలించి శనివారం రాత్రి సుశీల్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు.

Wrestler Sushil Kumar arrested in Punjab!
Wrestler Sushil Kumar arrested in Punjab

Wrestler Arrest: ఎలా దొరికిపోయాడంటే!

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల ఆధారంగా సుశీల్ కుమార్ ఆచూకీ పోలీసులకు తెలిసింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ టోల్ప్లాజాను ఆయన కారులో దాటుతుండగా సీసీటీవీ కెమెరాలలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు.గాలింపు తీవ్రతరం చేయగా పంజాబ్ లో సుశీల్ కుమార్ పోలీసులకు దొరికాడు. సుశీల్ కుమార్ తొి ఉన్న అజయ్ కుమార్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అతనికి కూడా ఈ హత్యతో సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.అజయ్ ని పట్టించిన వారికి కూడా ఢిల్లీ పోలీసులు యాభై వేల రూపాయల పారితోషికం ప్రకటించారు ఇక్కడ గమనార్హం.

అసలేం జరిగిందంటే?

ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఘర్షణలో 24 ఏళ్ళ ఓ రెజ్లర్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో భారత ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పాత్ర ఉందని పోలీసులకు సమాచారం అందగా లోతుగా దర్యాఫ్తు చేపట్టారు ఆ పక్కరోజే సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు .నాలుగో తేదీ రాత్రి రాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న రెజ్లర్ సాగర్ కుమార్ ని వినాయక్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సాగర్ కుమార్ ఢిల్లీలో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడు. సుశీల్ కుమార్ కు చెందిన ఈ స్టేడియం బయట ఓ ఇంటిలో సాగర్ కుమార్ తో సహా మరో ఇద్దరు ఉండగా వారిని వెళ్లిపోవాలని సుశీల్ కుమార్ కోరాడని తెలుస్తోంది. కానీ ఏం జరిగిందో గానీ పరిస్థితి ఘర్షణకు దారి తీసింది.

వారిలో వారే ఘర్షణ పడ్డారు!

కాగా వారెవరో తనకు తెలియదని, ఈ ఘటన చాలా పొద్దుపోయిన తరువాత జరిగిందని సుశీల్ కుమార్ . వారు ఘర్షణకు దిగినట్టు తెలియడంతో సమాచారాన్ని తానే పోలీసులకు తెలియజేశానని ఆయన అప్పట్లో మీడియాకు చెప్పాడు. తన స్టేడియానికి, ఈ ఘటనకు సంబంధం లేదని అన్నాడు. అయితే ఆ తర్వాత సుశీల్ కుమార్ పరారు కావడం ఆయనపై అనుమానాలు పెంచింది .ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు

సుశీల్ కుమార్ ఒలింపిక్స్ మెడలిస్ట్!

సుశీల్ కుమార్ పాపులర్ రెజ్లర్.. 2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు.సుశీల్ కుమార్ అరెస్టుతో ఈ మర్డర్ మిస్టరీ వీడనున్నది.

 

author avatar
Yandamuri

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju