NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీతో ఆందోళన విరమించిన రెజ్లర్లు

కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీతో భారత రెజ్లర్లు ఆందోళన విరమించారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా గత మూడు రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం రెండో దఫా చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనీ, ప్రతిభ కలిగిన రెజ్లర్లకు అన్యాయం జరుగుతోందని, ఆయనను డబ్ల్యుఎఫ్ఐ నుండి తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా జరుగుతున్న ఆందోళనలో భారత రెజ్లర్లు వినేష్ పోగల్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా 30 మంది పాల్గొనగా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ఇతర అధికారులు వీరితో పలు మార్లు చర్చలు జరిపారు. అయినా ఫలితం కనబడలేదు.

Wrestlers end protest after assurances from Sports Minister Anurag Thakur

 

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తన నివాసంలో రెజ్లర్లతో రెండో దఫా చర్చలు జరిపారు. దాదాపు ఏడు గంటల పాటు జరిగిన చర్చలు ఫలప్రదమైయ్యాయి. అనంతరం రెజ్లర్లతో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ .. మానిటరింగ్ కమిటీ వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామని చెప్పారు. కమిటీ లో వ్యక్తుల పేర్లు ఆదివారం ప్రకటిస్తామని తెలిపారు. ఈ కమిటీ తన విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేస్తుందని చెప్పారు. డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు భుషణ్ పై వచ్చిన అన్ని ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. విచారణ పూర్తి అయ్యే వరకూ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సంఘ రోజు వారి కార్యక్రమాలకు దూరంగా ఉంటారనీ, విచారణకు సహకరిస్తారని కేంద్ర మంత్రి రెజ్లర్లకు హమీ ఇచ్చారు. కేంద్ర మంత్రి హామీతో విచారణ పూర్తి అయ్యే వరకూ తమ నిరసనను విరమిస్తున్నామని ఏస్ ఇండియా రెజ్లర్ బజరంగ్ పునియా తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?