NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

WTC Final: వర్షం వల్ల ఏ జట్టు కి ఎంత లాభం?

WTC Final IND vs NZ

WTC Final: క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ను ఆస్వాదించాలనుకున్న క్రికెట్ అభిమానులకు వర్షం పెద్ద అడ్డుకట్టగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నాలుగో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నాలుగు రోజులలో రెండు రోజులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా మిగిలిన రెండు రోజుల్లో కూడా వెలుతురు సరిగ్గా లేని కారణంగా పూర్తిస్థాయిలో ఆట జరగలేదు. 

 

WTC Final IND vs NZ
WTC Final IND vs NZ

ఇక నాలుగో రోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో ఇండియా 217 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కాబట్టి ఆరవ రోజుని రిజర్వ్ డే గా ఐసిసి ముందే ప్రకటించింది. న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్లో ఎంతో పటిష్టమైన స్థితిలో ఉంది. 

ఒక దశలో మూడవ రోజంతా కూడా కివీస్ ఓపెనర్లు తమ విక్కెట్లు ఇచ్చే లాగా కనిపించలేదు అయితే ఆట చివర్లో పెవిలియన్ చేరడంతో భారత్ కు కొద్దిగా ఆశలు రేగాయి. అయితే ఇప్పుడు ఎనిమిది వికెట్లు చేతిలో ఉండడం కేవలం 116 పరుగులు మాత్రమే న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కంటే వెనుకబడి ఉండడంతో వారే ఫేవరెట్ అని చెప్పాలి. 

అయితే ఒక స్థితిలో భారత్ కూడా న్యూజిలాండ్ లాగానే పటిష్టంగా కనిపించింది కానీ త్వరగా వరుసగా వికెట్లను చేజార్చుకుంది. కాబట్టి వర్షం పడటం కారణంగా ఎవరు లాభపడ్డారు అంటే సరిగ్గా చెప్పలేని పరిస్థితి. టీమిండియా వర్షం పడకపోయి ఉంటే న్యూజిలాండ్ ను కూడా తమ స్కోర్ కి దగ్గరలోనే ఆలౌట్ చేసేవారమని భావిస్తూ ఉండవచ్చు. 

న్యూజిలాండ్ కూడా ఇక్కడి నుండి మ్యాచ్ పై మరింత పట్టు సాధించి భారత్ ను ఒత్తిడి లో నెట్టేసేవారమని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకరకంగా వర్షం వల్ల భారత సంక్లిష్ట పరిస్థితుల నుండి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ కోహ్లీసేన ఏ దశలోనూ డ్రా అనే పదం వినడానికి ఇష్టపడదు అన్నదీ తెలిసిందే. కాబట్టి రెండు రోజులు ఈ ఆటలో కొన్ని అద్భుతాలు చూడవచ్చు.

author avatar
arun kanna

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri