NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

TDP: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

tdp

టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న తునిలో 1983 నుండి 2004 వరుసగా ఆరుసార్లు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2009 లో త్రిముఖ పోరు నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి చీలక ఓట్ల ప్రభావంతో తొలి సారి యనమల రామకృష్ణుడు ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా చేతిలో పరాజయం పాలైయ్యారు.

దీంతో ఈ ఎన్నికల్లో కృష్ణుడి స్థానంలో తన కుమార్తె దివ్యను రామకృష్ణుడు బరిలోకి దింపారు. చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమార్తె దివ్యకు టికెట్ ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో సోదరుడు యనమల కృష్ణుడిని ఆయన దూరం పెట్టారు. దీంతో సోదరుల మధ్య విభేదాలు చేటుచేసుకున్నాయి.

మూడో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృష్ణుడు ప్రయత్నించగా, ఆయన ఆశలపై సోదరుడు రామకృష్ణుడు నీళ్లు చల్లారు. టీడీపీ టికెట్ దివ్యకు ఖరారు అయిన తర్వాత అసంతృప్తితో కృష్ణుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కుమార్తె గెలుపునకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న యనమల రామకృష్ణుడు పార్టీలోని ఇతర నేతలను కలుపుకుని వెళ్లే చర్యలు చేపట్టారు.

అయితే ..సొంత సోదరుడు కృష్ణుడుని బుజ్జగించే చర్యలు చేపట్టలేదు. దీంతో మరింత మనస్థాపానికి గురైన కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తొంది. ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు పార్టీలో చేరతారని చెబుతున్నారు. దీంతో తుని నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలినట్లేనని అనుకుంటున్నారు.

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N