Subscribe for notification

Yasin Malik: జమ్ముకశ్మీర్ వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు

Share

Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగం కేసులో జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యూసిన్ మాలిక్ ను ఢిల్లీలోని పటియాల ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఎన్ఐఎ అభియోగాలను యూసిన్ మాలిక్ గత మంగళవారం అంగీకరించిన నేపథ్యంలో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. తనపై మోపబడిన సెక్షన్ 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యలకు నిధుల సేకరణ) మరియు 20 (ఉగ్రవాద ముఠా సభ్యుడు) తదితర సెక్షన్ల అభియోగాలను సవాల్ చేయడం లేదని మాలిక్ కోర్టుకు తెలిపారు. కాగా దోషిగా తేల్చిన యాసిన్ మాలిక్ కు ఎంత జరిమానా విధించాలో నిర్ధారించేందుకు గానూ ఆయన ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)ను కోర్టు ఆదేశించింది. ఈ నెల 25న కోర్టు యాసిన్ మాలిక్ కు శిక్ష ఖరారు చేయనుంది. స్వాతంత్య పోరాటం పేరుతో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద మరియు ఇతర చట్టవిరుద్ద కార్యకలాపాల  నిధులు సమీకరణకు మాలిక్ ప్రపంచ వ్యాప్తంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారని కోర్టు గతంలో పేర్కొంది.

Yasin Malik convicted by Delhi court on terror funding case

ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయాద్, హిజ్బుల్ ముజుహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తో పాటు ఫరూఖ్ అహ్మద్ దార్ (బిట్టా కరాటే), షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండి యూసఫ్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయూంఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మహ్రోజుద్దీన్ కల్వాల్, బహీష్ తదితర వేర్పాటు వాదులపై ఎన్ఐఎ చార్జ్ షీటు దాఖలు చేసింది.


Share
somaraju sharma

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

41 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago