NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ 25 ఎంపీ క్యాండెట్లు ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు… బాబును గురి చూసి కొట్టాడుగా…!

ఏపీలోని వైసీపీ త‌ర‌పున పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ క్యాండెట్ల‌ను జ‌గ‌న్ ఈ రోజు ఇడుపుల పాయ సాక్షిగా ప్ర‌క‌ట‌న చేశాడు. సెంటిమెంట్ ప్ర‌కారం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌ట్టుగానే నందిగం సురేష్‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించేలా చేశారు. ఇక ఒక్క అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు సీటు వ‌దిలేస్తే మిగిలిన అన్ని పార్ల‌మెంటు స్థానాల‌కు జ‌గ‌న్ త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేసే ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు.

ఈ 24 మందిలో జ‌గ‌న్ ఈ సారి బీసీల‌కు బాగా ప్రాధాన్యం పెంచారు. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఇచ్చిన సీట్ల‌లో ఈ సారి బాగా కోత పెట్టేశారు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్మ వ‌ర్గానికి విజ‌య‌వాడ‌, న‌ర‌సారావుపేట‌, విశాఖ మూడు ఎంపీ సీట్లు ఇస్తే ఈ సారి విజ‌య‌వాడ మాత్ర‌మే ఇచ్చారు. అది కూడా టీడీపీ నుంచి పార్టీ మారి వైసీపీలోకి వ‌చ్చిన కేశినేని నానికి కావ‌డం విశేషం.

ఈ సారి బీసీల‌కు ఎక్కువ పార్ల‌మెంటు సీట్లు ఇచ్చారు. తూర్పు కాపుల‌కే విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు సీట్లు ఇచ్చారు. శ్రీకాకుళం సీటును కాళింగ సామాజిక వ‌ర్గానికి కేటాయించారు. ఇక అర‌కు ఎలాగూ ఎస్టీ సీటు కాగా.. ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయిన నాలుగు సీట్ల‌లో బాప‌ట్ల మాత్ర‌మే మాదిగ‌ల‌కు ఇవ్వ‌గా, అమ‌లాపురం, తిరుప‌తి, చిత్తూరు మూడు పార్ల‌మెంటు స్థానాలు మాల‌ల‌కు ఇచ్చారు. యాద‌వుల‌కు న‌ర‌సారావుపేట‌, ఏలూరు, బీసీల్లోనే మ‌రో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం అయిన శెట్టిబ‌లిజ‌ల‌కు న‌ర‌సాపురం, రాజ‌మండ్రి సీట్లు ఇచ్చారు.

ఇక బీసీల్లో బోయ కుల‌స్తుల‌కు హిందూపురం, క‌ర్నూలు పార్ల‌మెంటు సీట్లు ఇచ్చారు. బీసీల్లో కురుబ‌ల‌కు అనంత‌పురం సీటు ఇవ్వ‌గా.. రెడ్డి వ‌ర్గానికి ఐదు పార్ల‌మెంటు సీట్లు ఇచ్చారు. ఇక కాపుల‌కు కూడా గుంటూరు, బంద‌రు, కాకినాడ పార్ల‌మెంటు సీట్లు ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో క్ష‌త్రియ‌ల‌కు ఇచ్చిన న‌ర‌సాపురం సీటును ఈ సారి తీసేశారు. అలాగే గౌడ‌ల‌కు ఒక సీటు ఇవ్వ‌గా.. ఈ సారి ఆ కులానికి కూడా కోత పెట్టేశారు. అన‌కాప‌ల్లి సీటు ప్ర‌స్తుతానికి పెండింగ్ లో పెట్టినా ఈ సీటు కూడా బీసీల‌కే ఇవ్వ‌డం అయితే దాదాపు ఖ‌రారైంది.

ఏదేమైనా తెలుగుదేశం ఆయువు ప‌ట్టు అయిన బీసీల‌కు ఈ సారి ఏకంగా 11 పార్ల‌మెంటు సీట్లు ఇవ్వ‌డం సెన్షేష‌న‌ల్‌. చంద్ర‌బాబు ఏ బీసీల మీద అయితే ఆశ‌లు పెట్టుకున్నారో.. దానిమీద గురి చూసి జ‌గ‌న్ కొట్టిన‌ట్ల‌య్యింది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju