NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలోకి వైసీపీ బిగ్ షాట్ జంప్‌… తండ్రి, కొడుకు ఇద్ద‌రికి టిక్కెట్లు ఫిక్స్‌..!

ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీలోకి చేర‌డం దాదాపు ఖాయ‌మై పోయింది. వ‌చ్చే ఎన్నికల్లో ఆయ‌నకు వైసీపీ టికెట్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు కూడా అవ‌కాశం ఇవ్వలేద‌నే టాక్ వ‌చ్చింది. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా వ‌చ్చిన సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు ఆయ‌న ప్ర‌యత్నించినా.. జ‌గ‌న్ ముభావంగా వ్య‌వ‌హ‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

YCP big shot jump into TDP... Tickets
YCP big shot jump into TDP Tickets

అదేస‌మ‌యంలో వైసీపీ మాజీ మంత్రి, కీల‌క నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి కూడా.. మాగుంట కోసం విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. అయినా కూడా.. ఆయ‌న‌కు టికెట్‌లేద‌ని.. సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు. దీంతో ఇక‌, వేచి చూసి.. విసిగిపోయిన మాగుంట‌.. టీడీపీ వైపు చూశారు. వాస్త‌వానికి.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాగుంట‌.. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి అప్ప‌ట్లో ప‌రాజ‌యం పొందారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు. 2019 ఎన్నిక‌ల్లో కూడా ఒంగోలు ఎంపీ సీటు మాగుంట‌కే కేటాయించారు. అయితే ఆయ‌న ఎన్నిక‌ల ముందు అనూహ్యంగా వైసీపీలోకి జంప్ చేసి టికెట్ ద‌క్కించుకుని ఎంపీగా గెలిచారు.

అయితే.. ఈ ద‌ఫా కొన్ని కార‌ణాల‌తో వైసీపీ ఏకంగా ఆయ‌నను ప‌క్క‌న పెట్టింది. దీంతో టీడీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న మాగుంట‌కు చంద్ర‌బాబు నుంచి ఆహ్వానం కూడా అందిన‌ట్టు ఒంగోలులో చ‌ర్చ సాగుతోంది. మంగ‌ళ‌వారం లేదా.. బుధ‌వారం ఆయ‌న అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీలో ఆయ‌న ఒక్క‌డికే కాకుండా.. ఆయ‌న కుమారుడి కి కూడా టికెట్ ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మాగుంట యథాప్ర‌కారం.. ఒంగోలు నుంచి ఎంపీగా, ఆయ‌న కుమారుడికి వేరే అసెంబ్లీ సీటును కేటాయిం చేందుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్‌.

YCP big shot jump into TDP... Tickets
YCP big shot jump into TDP Tickets

మాగుంట త‌న‌యుడికి మార్కాపురం లేదా ద‌ర్శి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తార‌ని తెలుస్తోంది. ద‌ర్శి జ‌న‌సేన‌కు ఇస్తే మాగుంట త‌న‌యుడికి మార్కాపురం సీటు ఇవ్వ‌డం ఫిక్సే. అందుకే ఆయ‌న పార్టీలోకి వెళ్తున్నార‌ని అంటున్నా రు. ఇక‌, వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. ఒంగోలు లో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని నిల‌బెట్టే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని స‌మాచారం. ఈయ‌న గ‌ట్టి పోటీ ఇచ్చినా.. గెలుపు మాత్రం లోక‌ల్ నేత‌గా గుర్తింపు పొందిన మాగుంటకే ద‌క్కే అవ‌కాశం మెండుగా ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. మాగుంట రాజ‌కీయం ఇక‌, టీడీపీలో ప్రారంభం కానుంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju